2015 లైఫ్‌స్టైల్ కలెక్షన్‌ను విడుదల చేసిన జాగ్వార్
బ్రిటిష్ ఆధారిత లగ్జరీ కార్ తయారి సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ భారత మార్కెట్లో తన ఉనికిని చాటుకుంటోంది. ప్రస్తుతం చాలా ఉత్పత్తులను అందిస్తుఉంది.
ఇప్పుడు జాగ్వార్ లాండ్ రోవర్ తన 2015 లైఫ్‌స్టైల్ కలెక్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. అన్ని కొత్త దుస్తులు, గిఫ్ట్‌లు, యాక్ససరీస్‌లు మరియు లగేజి వస్తువులు మహిళలు, పురుషుల కోసం అందిస్తోంది.

వారు 2015 జాగ్వార్ కలెక్షన్ మరియు 2015 లాండ్ రోవర్ కలెక్షన్ అనే రెండు ముఖ్యమైన కలెక్షన్స్‌ను కలిగి ఉంది. కొత్త 2015 లైఫ్‌స్టైల్ కలెక్షన్ భారత్‌లో 21 డీలర్‌షిప్ కలిగిన ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది.
జాగ్వార్ లాండ్ రోవర్ ఇండియా అధ్యక్షులు రోహిత్ సురి మాట్లాడుతూ...." జాగ్వార్ మరియు లాండ్ రోవర్ బ్రాండ్‌లు భారత్‌లో లగ్జరీని, మంచి స్థితిని కలిగి ఉన్నాయి. ఇంకా అభివృద్ధితో ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం " అని తెలిపారు.

వారు చిన్న పిల్లల కోసం ప్రత్యేక కలెక్షన్‌లు కల్పిస్తున్నారు. అందులో బేస్ బాల్ క్యాప్స్, బొమ్మ మోడళ్లు, టీ-షర్ట్స్ ఉన్నాయి. అన్ని మోడళ్లు జాగ్వార్ లాండ్ రోవర్ హౌస్‌లో ప్రత్యేక టీంతో డిజైన్ చేయబడ్డాయి.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్‌స్పార్క్.......


Click it and Unblock the Notifications








