మోస్ట్ బ్యూటిఫుల్ కార్ ఆఫ్ 2014 - 'జాగ్వార్ ఎక్స్ఈ'

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ రూపొందించిన లేటెస్ట్ ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ 'జాగ్వార్ ఎక్స్ఈ' (Jaguar XE) ప్యారిస్‌లో జరిగిన ఫెస్టివల్ ఆటోమొబైల్ ఇంటర్నేషల్ 30వ ఎడిషన్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ కార్ ఆఫ్ 2014 అవార్డును కైవసం చేసుకుంది.

ప్రపంచంలోని 59 దేశాలకు చెందిన 1,00,000 మందికి పైగా ప్రదలు వోట్ ద్వారా ఈ అవార్డుకు జాగ్వార్ ఎక్స్ఈని ఎంపిక చేశారు. ఈ అవార్డు కోసం మజ్దా ఎమ్ఎక్స్-5, మెర్సిడెస్ సి-క్లాస్ ఎస్టేట్, ఫియట్ 500ఎక్స్ వంటి మోడళ్లు పోటీ పడగా, జాగ్వార్ ఎక్స్ఈ మాత్రం అన్నింటి కన్నా ముందు నిలిచింది.

jaguar xe most beautiful car

దాదాపు 600 మందికి పైగా ప్రముఖులు హాజరైన ఫెస్టివల్ ఆటోమొబైల్ ఇంటర్నేషల్ 30వ ఎడిషన్‌లో జాగ్వార్ డిజైన్ డైరెక్టర్ ఇయాన్ కల్లమ్ ఈ అవార్డును అందుకున్నారు. జాగ్వార్ ఎక్స్ఈ మోడల్‌కి అందిన రెండవ అవార్డ్ ఇది. అక్టోబర్ 2014లో జరిగిన ప్యారిస్ మోటార్ షోలో ఇది బెస్ట్ ప్రొడక్షన్ కార్ అవార్డును దక్కించుకుంది.

జాగ్వార్ ఎక్స్ఈ కారును తొలిసారిగా 2014 ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కరంచారు. ప్రస్తుతానికి ఈ మోడల్ కోసం యూకే మార్కెట్లో ప్రీఆర్డర్లను అంగీకరిస్తున్నారు. ఈ ఎంట్రీ లెవల్ జాగ్వార్ లగ్జరీ కారు భారత మార్కెట్లో కూడా విడుదల కావచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, January 29, 2015, 12:32 [IST]
English summary
The Jaguar XE has been awarded the Most Beautiful Car of 2014 at the 30th edition of Festival Automobile International in Paris. The award was decided by public vote, with more than 100,000 people who voted from 59 countries across the world.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+