ఫియట్ ఇండియా కొత్త ప్రెసిడెంట్, ఎండిగా కెవిన్ ఫ్లైన్
ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్ ఇండియాలో యాజమాన్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకూ ఈ కంపెనీలో ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చిన నాగేష్ బసవనహల్లి స్థానంలో కొత్త వ్యక్తి చేరారు.
ఫియట్ ఇండియా ప్రెసిడెంట్, ఎండిగా పనిచేస్తున్న నాగేష్ బసవనహల్లి కంపెనీ వదిలిపెట్టి వెళ్లిపోవటంతో ఆయన స్థానంలో కెవిన్ ఫ్లైన్‌ను నియమించారు. ఇక నుంచి ఈ పదవిలో కెవిన్ ఫ్లైన్ విధులు నిర్వర్తించనున్నారు.
ఆటోమొబైల్ పరిశ్రమలో కెవిన్ ఫ్లైన్‌కు దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. ఫియట్ ఇండియాల చేరడానికి ముందుగా ఆయన జాగ్వార్ ల్యాండ్ రోవర్ సౌత్ ఆఫ్రియా, సబ్ సహారా ఆఫ్రికా విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసేవారు.

భారత మార్కెట్లో తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయటంలో ఫియట్ ఇండియా ఆశించిన విజయాన్ని సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో, యాజమాన్య మార్పు ద్వారానైనా కొంత సానుకూల వృద్ధిని రాబట్టవచ్చని కంపెనీ ఆశిస్తోంది.
కాగా.. ఇప్పటి వరకూ ఈ పదవిలో కొనసాగిన నాగేష్ బసవనహల్లి కంపెనీ నుంచి హఠాత్తుగా వెళ్లిపోవటానికి గల స్పష్టమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఫియట్‌కు భారత్‌లో 132 డీలర్‌షిప్‌లున్నాయి. త్వరలోనే అబార్త్, జీప్ బ్రాండ్లను ఇండియాలో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కొత్త వ్యూహాలతోనైనా ఫియట్‌కు భారత్‌లో మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications








