400 బుకింగ్స్ నమోదు చేసుకున్న ల్యాండ్ రోవర్ డిస్కవరి స్పోర్ట్
అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి చెప్పుకునే ల్యాండ్ రోవర్ ఈ మధ్యనే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి తన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ కారును విడుదల చేసింది. అప్పటి నుండి ల్యాండ్ రోవర్ దాదాపుగా 400 బుకింగ్స్‌ను నమోదు చేసుకుంది.
అయితే కొత్తగా విడుదలైన ఈ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ యస్‌యువి మరో నాలుగు నెలల గడువుతో అందుబాటులోకి రానుంది.
ల్యాండ్ రోవర్ డిస్కవరి స్పోర్ట్ యొక్క మరిన్ని విశేషాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం...

ఇంజన్ :
ఇందులో 2.2-లీటర్, టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ ఇది మీకు 148బిహెచ్ మరియు 400ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్:
ఇందులో గల 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ అన్ని చక్రాలకు అందుతుంది. ఇదే గేర్ బాక్స్‌ను ఎవోక్ లో కూడా అందిస్తున్నారు.

భద్రత:
భద్రత పరమైన అంశాలు:
- ఆరు ఎయిర్ బ్యాగ్‌లు
- డ్యూయల్-స్టేజ్ ఎయిర్ బ్యాగ్
- యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్
- టార్క్-ఆన్-డిమాండ్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్
- హిల్ డిసెంట్ కంట్రోల్
- మూడవ వరుసలో గల సీటును ముడిపే అవకాశం కల్పించారు.

భద్రత:

డిజైన్:
దీని ముందు భాగాన్ని రేంజ్ రోవర్ ఎవోక్ ప్రేరణతో తయారు చేశారు. మరియు దీని లైటింగ్ సిస్టమ్ ల్యాండ్ రోవర్ కొత్త తయారు పద్దతి మీద ఆధారపడి తీర్చిదిద్దారు.

సీటింగ్ కెపాసిటి:
ఈ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ యస్‌యువి ఏడు మరియు ఐదు సీట్ల అప్షన్‌లలో లభిస్తుంది.

ధర
ఈ కొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరి స్పోర్ట్ ధర దాదాపుగా రూ. 54 లక్షలు
ఆన్-రోడ్ (ఢిల్లీ)గా ఉండవచ్చని అంచనా.



Click it and Unblock the Notifications








