లేటెస్ట్ టెక్నాలజీ డీజిల్ ఇంజన్లు లంగ్ క్యాన్సర్‌ను కలిగించవు: స్టడీ
డీజిల్ ఇంజన్లు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్‌ను మనుషులు పీల్చడం మూలంగా లంగ్ క్యాన్సర్ రిక్స్ ఎక్కువగా ఉంటుందనే అపోహలు ఇది వరకు విస్తృతంగా ఉండేవి. ఇప్పుడు ఆ అపోహలు నిజం కావని తాజా అధ్యయనాలు తేలుస్తున్నాయి.
ఈ అంశంపై ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో.. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన డీజిల్ ఇంజన్ల వలన ఎలాంటి లంగ్ క్యాన్సర్ రాదని తేలింది. పాత తరం డీజిల్ ఇంజన్లతో పోల్చుకుంటే, ఈ కొత్త తరం డీజిల్ ఇంజన్లు 90 శాతం తక్కువ కర్భన వ్యర్థాలను విడుదల చేస్తాయని రుజువైంది.
మొత్తం 30 నెలల పాటు వారానికి 80 గంటల చొప్పున వెలువడి డీజిల్ పొగ నుంచి సేకరించిన దత్తాశం ఆధారంగా, ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షలలో ఈ నిజాలు బయటపడ్డాయి. ఈ అధ్యయనం కోసం ఈపిఏ07 రకం ఇంజన్లను మరియు డీజిల్ పర్టిక్యులేట్ ఫిల్టర్లను ఉపయోగించారు.

పాత ఇంజన్లతో పోల్చుకుంటే, ఈ కొత్త తరం డీజిల్ ఇంజన్ల నుంచి వచ్చే పొగ జీవితకాలం పాటు కూడా ఎలాంటి హాని కలిగించదని ఈ పరిశోధనలో తేలింది. వాస్తవానికి దీర్ఘకాలం పాటు ఎన్ఓ2ని పీల్చడం వలన లంగ్స్‌లో కొన్ని మార్పులు వస్తాయి. కానీ ఈ ఈపిఏ10 ఇంజన్ల వలన అది కూడా గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది.
అమెరికా, యూరప్ దేశాలలో దాదాపు 30 శాతం ట్రక్కులు, బస్సులు ఈ ప్రమాణాలతో కూడిన ఇంజన్లనే ఉపయోగిస్తున్నాయి. చైనా వంటి ఇతర దేశాలు ఇలాంటి ఇంజన్లను నడిపేందుకు వీలైన ఆల్ట్రా-లో సల్ఫర్ డీజిల్‌ను అమలు పరచేదిశగా చర్యలు తీసుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications








