4-స్టార్ రేటింగ్ పొందిన దేశీయంగా తయారైన హ్యుందాయ్ క్రెటా

By Anil

ప్రస్తుతం కాలంలో కార్లు ఎంత అందంగా ఉన్నాయి అనే దానికన్నా. అవి ఎన్ని సేఫ్టి ఫీచర్లను కలిగి ఉన్నాయి అనేది చాలా ముఖ్యమైన అంశం. అందుకోసం దేశీయంగా తయారయిన హ్యుందాయ్ క్రెటా కారుకు ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో ఇది 4-స్టార్ రేటింగ్ పొందింది.

హ్యుందాయ్ క్రెటా దేశీయ యస్‌యువి మార్కెట్లో ఒక సంచలనం. దీనిని విడుదల చేసిన అతి కొద్ది కాలంలోనే విపరీతమైన ప్రజాదరణను పొందింది. అంతే కాదండోయ్ అమ్మకాల పరంగా కూడా ఇది మంచి రికార్డును నమోదు చేసుకుంటోంది.

హ్యుందాయ్ మోటార్స్ వారు డిజైన్‌కు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ఇప్పుడు భద్రతను కూడా పరిగణలోనికి తీసుకుని మార్కెట్లోకి తమ వాహనాలను అందిస్తున్నారు. అందులో భాగంగానే దేశీయంగా తయారైన క్రెటా యస్‌యువికి ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో క్రాష్ పరీక్షలను నిర్వహించారు. దీనికి సంభందించిన మరింత సమాచారం క్రింది కథనం ద్వారా తెలుసుకోండి.

భద్రత పరంగా 4-స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ క్రెటా

దీనిలో ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగ్‌లు కలవు. ముందు వైపున క్రాష్ పరీక్షలు నిర్వహించగా. నాలుగు స్టార్‌ల రేటింగ్ పొందింది.

భద్రత పరంగా 4-స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ క్రెటా

ముందు వైపున నిర్వహించిన క్రాష్ పరీక్షలలో ఇది మంచి ఇంపాక్ట్ స్ట్రెంథ్‌ని కలిగి ఉందని తెలిపారు. ఇది భారతీయ రోడ్లకు బాగా సరిపోతుందని ఈ సంధర్భంగా వెల్లడించారు.

భద్రత పరంగా 4-స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ క్రెటా

యూరప్‌లో తయారయిన హ్యుందాయ్ క్రెటా వేరియంట్ ఆరు ఎయిర్ బ్యాగ్‌లను కలిగి ఉందని తెలిపారు. భారత్‌లో విడుదలైన ప్రారంభ వేరియంట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు వచ్చే అవకాశం లేదు. కాని యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌ వంటి ఫీచర్లను అందించారు.

భద్రత పరంగా 4-స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ క్రెటా

భారత్‌లో తయారయిన వాహనాలకు దేశీయంగా క్రాష్ పరీక్షలను నిర్వహించుకునే అవకాశం రానుంది. 2016 నుండి 2017 మధ్యలో ఇది రానుంది. ఈ అవకాశం మన దేశంలో అందుబాటులోకి వస్తే దేశీయంగా పరీక్షలు నిర్వహించి అమ్మకాలు ప్రారంభించవచ్చు.

భద్రత పరంగా 4-స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ క్రెటా

క్రాష్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారో చూడాలని ఉందా? అయితే ఈ కథనం క్రింద దీనికి చెందిన వీడియో కలదు చూడండి.

హ్యుందాయ్
  1. సరి కొత్త మార్పులతో రానున్న హ్యుందాయ్ క్రెటా
  2. ఏడు కార్ల మీద అద్బుతమైన ఆఫర్లను ప్రకటించిన హ్యుందాయ్ మోటార్స్
  3. డిసెంబర్ 18 న విడుదల కానున్న డిఎస్‌కె బెనెల్లీ టియన్‌టి 25


More from DriveSpark

Article Published On: Wednesday, December 16, 2015, 17:22 [IST]
English summary
Made In India Hyundai Creta Latin Ncap Crash Result
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+