ఢిల్లీలో బుక్ చేసుకున్న వారు మీ డబ్బును వెనక్కి తీసుకెళ్లండి : మహీంద్రా అండ్ మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా కు చెందిన రకరకాల ఉత్పత్తుల కోసం ఢిల్లీ నగరంలో విపరీతమైన బుకింగ్స్ జరిగాయి. అయితే సుప్రీం కోర్టు 2000సీసీ కన్నా ఎక్కువ కెపాసిటి గల డీజల్ కార్ల మీద రిజిస్ట్రేషన్లను నిషేధించిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో మహీంద్రా వారి కార్లను డెలివరీ తీసుకున్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు లేదు.
Also Read: అత్యంత భయంకరమైన, అసాధారణ బ్రిడ్జ్: ఇది ఎక్కడ ఉందో తెలుసా?
అందుకోసం మహీంద్రా అండ్ మహీంద్రా వారు కస్టమర్లకు ఇష్టపూర్వకమైన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా కార్లను బుక్ చేసుకున్న వారందరికి కూడా బుకింగ్ రుసుము తిరిగి చెల్లించేందుకు సిద్దమైంది.
Also Read: మహీంద్రా వారు అధికారికంగా ఆవిష్కరించిన కెయువి1OO
ఈ 2000సీసీ కన్నా ఎక్కువ కెపాసిటి గల కార్ల రిజిస్ట్రేషన్లకు చెందిన రూల్ 2016 జనవరి నుండి మార్చి వరకు అమలులో ఉండనుంది.అయితే ఇది కేవలం ఢిల్లీ పరిధిలో మాత్రమే అమలులో ఉండనున్నట్లు పేర్కొంది.
Also Read: 2000సీసీ పైబడి ఉన్న డీజల్ కార్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించిన సుప్రీం కోర్టు
భారీ స్థాయిలో నష్టపోతున్న మహీంద్రా అండ్ మహీంద్రా: మహీంద్రా వారి ఉత్పత్తులైన స్కార్పియో, ఎక్స్‌యువి5OO, టియువి 3OO మరియు వచ్చే నెలలో విడుదల కానున్న కెయువి1OO వంటి మోడల్లకు ఢిల్లీ పరిధిలోనే ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే మహీంద్రా వారు దీనికి అనుగుణంగా వీటిని పెట్రోల్ ఇంజన్‌తో అమ్మకాలు చేపట్టాలని యోచిస్తోంది.



Click it and Unblock the Notifications








