మహీంద్రా అండ్ మహీంద్రా 50 లక్షవ వాహనం
దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరో అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది. భారత్‌లో మహీంద్రా తయారు చేసిన 50 లక్షవ వాహనాన్ని ముంబైలోని కండివాలీలో ఉన్న ప్లాంట్ నుంచి విడుదల చేసింది.
మహీంద్రా ఉత్పత్తి చేసిన ఈ 50 లక్షవ వాహనం ఓ 4x4 ఆఫ్-రోడర్ మహీంద్రా థార్ ఎస్‌యూవీ. గడచిన 2012 సంవత్సరంలో మహీంద్రా 40 లక్షల వాహనాల మైలురాయిని చేరుకోగా, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే మరో 10 లక్షల వాహనాల మైలురాయిని చేరుకోవటం విశేషం.
మహీంద్రా అండ్ మహీంద్రాకు ఛాకన్, నాసిక్, హరిద్వార్, జహీరాబాద్, కండివాలీ మరియు ఇగత్‌పురిలలో ఉన్న ఆరు ఆటోమోటివ్ ప్లాంట్‌లు కలిసికట్టుగా పనిచేయటం వలన ఈ మైలురాయి సాధ్యమైందని కంపెనీ పేర్కొంది.
ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. గడచిన ఏడు దశాబ్ధాల తమ ఆటోమోటివ్ ప్రయాణంలో ఈ 50 లక్షవ వాహనాన్ని ఉత్పత్తి చేయటం అనేది తమకు ఓ ప్రత్యేకమైన మైలురాయి అని, అంతేకాకుండా ఇది ప్రపంచ స్థాయి వాహనాలను ఉత్పత్తి చేయటంలో తమ కట్టుబాటును తెలియజేస్తుందని అన్నారు.



Click it and Unblock the Notifications








