మహీంద్రా అండ్ మహీంద్రా నుండి సరికొత్త కాంపాక్ట్ యస్‌యువి యస్101

By Anil

దేశీయ వాహన దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా భారతీయ మార్కెట్లోకి మరొక కాంపాక్ట్ యస్‌యువీని తీసుకు వస్తోంది. యస్101 అనే కోడ్ పేరుతో ఈ మద్యనే మార్కెట్ కు పరిచయం చేసింది. అయితే దీనికి డిసెంబర్ 18, 2015 న మోడల్ పేరును నామకరణం చేయనుంది.

ఈ కార్యక్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా వాహన సంస్థ యొక్క ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మరియు మహీంద్రా అండ్ మహీంద్రా వాహన సంస్థకు ముఖ్యకార్యనిర్వహణాధికారి అయిన ప్రవీణ్ షాహ్ పాల్గొననున్నారు.

 మహీంద్రా వారి యస్101 కాంపాక్ట్ యస్‌యువి

ఈ కొత్త కాంపాక్ట్ యస్‌యువి కారుకు ఎక్స్‌యువి 1OO అనే పేరును నామకరణం చేయనున్నారు. ఇప్పటికే మహీంద్రా మోటార్స్ ఎక్స్‌యువి5OO, టియువి3OO వంటి మోడల్స్‌ను మార్కెట్లో అందుబాటులో ఉంచింది.

 మహీంద్రా వారి యస్101 కాంపాక్ట్ యస్‌యువి

ఈ సరికొత్త ఎక్స్‌యువి 1OO కారులో మూడు సిలిండర్లు గల 1.2-లీటర్ పెట్రోల్ యంత్రాన్ని కల్పించనుంది. ‌ఈ యంత్రాన్ని ప్రత్యేకంగా యస్101 కారు కోసం దేశీయంగా అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు.

 మహీంద్రా వారి యస్101 కాంపాక్ట్ యస్‌యువి

ఈ కొత్త ఇంజన్‌కు జోడిగా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్(ఎయమ్‌టి) ఆప్షన్‌ కూడా పరిచయం చేస్తున్నారు.

 మహీంద్రా వారి యస్101 కాంపాక్ట్ యస్‌యువి

ఈ యస్101 కారు యొక్క ఛాసిస్ ల్యాడర్ ఫ్రేమ్ డిజైన్ ఆధారంతో రూపొందించనున్నారు. మరియు ఎక్స్‌యువి5OO ప్రేరణతో దీనిని తయారు చేయనున్నారు.

 మహీంద్రా వారి యస్101 కాంపాక్ట్ యస్‌యువి

ఇది మార్కట్లోకి విడుదలైతే ధర దాదాపుగా రూ. 4 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు.

 మహీంద్రా వారి యస్101 కాంపాక్ట్ యస్‌యువి

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఎక్స్‌యువి1OO ను 2016 జనవరిలో జరిగే ఢిల్లీ ఆటో ఎక్స్-పోలో ప్రదర్శించనుంది. దీని గురించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీకు అందిస్తుంది. మరిన్ని విషయాలకు డ్రైవ్ స్పార్క్‌తో కలిసి ఉండండి.

మహీంద్రా అండ్ మహీంద్రా

More from DriveSpark

Article Published On: Tuesday, December 15, 2015, 16:22 [IST]
English summary
Mahindra S101 Compact SUV To Be Christened On December 18
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+