ఏడు రోజులకు 1.75 లక్షల రుపాయల ఆఫర్లు ప్రకటించిన మహీంద్రా మోటార్స్
నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలపడానికి కేవలం ఒక వారం సమయం మాత్రమే ఉండగా మహీంద్రా అండ్ మహీంద్రా వారు దేశ వ్యాప్తంగా గల తమ అన్ని మోడల్ కార్ల మీద దాదాపుగా 1.75 లక్షలు విలువైన సంవత్సరాంతపు ఆఫర్లను ప్రకటించింది.భారతీయ యస్‌యువి మార్కెట్లో విపరీతమైన మార్పులు తీసుకువచ్చిన మహీద్రా అండ్ మహీంద్రా వారు ప్రస్తుతం కొత్తగా విడుదల చేసిన వాటి మీద ఎటువంటి ఆఫర్లను ప్రకటించలేదు.
దాదాపుగా ఏడు మోడల్స్ మీద ఈ ఆఫర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే ఏ మోడల్ మీద ఎంత వరకు ఆఫర్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? క్రింద గల కథనం మీద ఓ లుక్కేసుకోండి.

వెరిటో
మహీంద్రా వారి సెడాన్‌లలో ఉన్న ఏకైక కారు వెరిటో. దీని మీద దాదాపుగా 50,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించింది.

ఎక్స్‌యువీ5OO
స్కార్పియో తరువాత అత్యంత ఆధరణ పొందిన యస్‌యువి ఎక్స్‌యువి5OO. ఈ కారు మీద దాదాపుగా 60,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించింది.

స్కార్పియో
మహీంద్రా వారికి ప్రాథమికంగా అత్యంత గుర్తింపును తీసుకువచ్చిన మోడల్ స్కార్పియో. మహీంద్రా వారు ఈ స్కార్పియో వాహనం మీద దాదాపుగా 80,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించింది.

మహీంద్రా జైలో
జైలో వాహనం మీద మహీంద్రా అండ్ మహీంద్రా వారు దాదాపుగా 83,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.

బొలెరో
జీపు తరహాలో ఉంటుంది చూశారా. ఈ ఏడాది మహీంద్రా వారి అత్యధికంగా అమ్మిన వాటిలో బొలెరో వాహనం ఒకటి. బొలెరో మీద 86,065 రుపాయల ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించారు.

క్వాంటో
మహీంద్రా క్వాంటో మీద లక్ష రుపాయలు వరకు ఆఫర్ ను ప్రకటించారు. మీరు చదివింది నిజమే, మహీంద్రా అండ్ మహీంద్రా వారు క్వాంటో మీద 1 లక్ష రుపాయల డిస్కౌంట్‌ను ప్రకటించింది.

శాంగ్‌యాంగ్
సౌత్ కొరియాకు చెందిన ఈ శాంగ్‌యాంగ్ మోటార్స్ భారతీయ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా వారి ఆధ్వర్యంలో కార్యకలాపాలు జరుపుతోంది. ప్రస్తుతం శాంగ్‌యాంగ్ వారి ఏకైక ఉత్పత్తి అయిన శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ మీద అత్యధికంగా 1.75 లక్షల డిస్కౌంట్‌ను ప్రకటించింది.

కొత్త మోడల్స్
ఈ మధ్యనే విడుదల చేసిన టియువి3OO మీద ఎటువంటి ఆఫర్‌ను ప్రకటించలేదు. అయితే దీనిని మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుండి భారీగానే అమ్మకాలు జరుపుతోంది.

కెయువి1OO
మహీంద్రా ఈ మధ్యనే మార్కెట్లోకి మొట్టమొదటి డీజల్ యస్‌యువిని పరిచయం చేసింది. దీనిని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు. అయితే దీనికి సంభందించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించింది.


Click it and Unblock the Notifications








