మారుతి బాలెనొ కారు వేరియంట్స్, సౌకర్యాలు మరియు ఇతర వివరాలు.
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారి సంస్థ అయిన మారుతి సుజుకి తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనొని నవంబర్ నెలలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. బాలెనొ కారు యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నవంబర్ 26 నుండి వీటిని నెక్సా షోరూములలో అమ్మకానికి ఉంచనున్నారు. మరియు అడ్వాన్స్ బుకింగ్స్ యొక్క ప్రారంభపు ధరని 25,000 రుపాయలుగా నిర్ణయించారు.
నెక్సా షోరూమ్‌లో రెండవ కారుగా అందుబాటులోకి రానుంది. మారుతి సుజుకి నిర్వహిస్తున్న నెక్సా షోరూమ్‌లో మొదటిది అందుబాటులో ఉన్న మొదటి మోడల్ సుజుకి యస్-క్రాస్, రెండవ మోడల్ గా బాలెనొని ప్రవేశపెట్టనున్నారు. బాలెనొ కారు ఖచ్చితంగా వినియోగదారులను ఆకర్షిస్తుందని నెక్సా ప్రీమియం షోరూమ్ వారు గట్టిగా నమ్ముతున్నారు.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: అత్యంత చవకైన కారు ఇంధనం తయారు చేసిన మధ్యప్రదేశ్ వాసి.
మారితి సుజుకి బాలెనొ వేరియంట్‌లు మరియు సౌకర్యాలు క్రింద గల స్లయిడర్‌లో చూడవచ్చు.

రకరకాల వేరియంట్స్ :
మారుతి బాలెనొ కారు నాలుగు రకాల వేరియంట్లలో విక్రయాలు మొదలు పెట్టనున్నారు. అవి సిగ్మా, డెల్టా, జీటా మరియు ఆల్ఫా వీటికి సంబంధించిన సౌకర్యాలను తరువాత స్లయిడర్‌లో చూడవచ్చు.

బాలెనొ సిగ్మా వేరియంట్ :
ఇందులో ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగ్‌లు ఉన్నాయి, ముందు వైపున పవర్ విండో కలదు. భద్రత పరంగా యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబియస్) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి) లను అందుబాటులో ఉంచారు. అడ్జెస్ట్ చేసుకునే వీలున్న పవర్ స్టీరింగ్ , గేర్ మార్పిడిని సూచించే ఇండికేటర్, హీటర్‌తో కూడిన ఎయిర్ కండీషనర్, సెంటర్ లాకింగ్ ఇందులో మరిన్ని ప్రత్యేకతలు.

బాలెనొ డెల్టా వేరియంట్ :
ఇందులో ముందు మరియు వెనుకవైపున పవర్ విండోలను అమర్చారు. క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన ఎయిర్ కండిషనర్, కరెంటుతో అడ్జెస్ట్ చేసుకోగల కారు బయటి అద్దాలు, పార్కింగ్ కోసం వెనుకవైపున సెన్సార్లను అమర్చారు, స్టీరింగ్ మీద ఆడియో సిస్టమ్ కంట్రోల్‌ను అమర్చారు. కీ లెస్ ఎంట్రి, పెట్రోల్ వేరియంట్‌లో సి.వి.టి గేర్ బాక్స్‌ను అందిచారు, వెనుకవైపున డీ ఫోగర్ గల వైఫర్‌ను అమర్చారు.(సి.వి.టి మరియు డీఫోగర్ గురించి తరువాత స్లైడర్ నుండి తెలుసుకోండి).

సి.వి.టి మరియు డీఫోగర్ అనగా :
ప్రక్కనున్న ఫోటోను ఒక సారి గమనించినట్లయితే మిర్రర్ మీద కొన్ని గీతలను మీరు చూడవచ్చు, అంటే అందులో ఉన్న గీతల గుండా విద్యుత్‌ను పంపించి అద్దాన్ని కాస్త వేడి చేస్తారు తద్వారా చలికాలంలో దాని మీద పేరుకున్న మంచును కరిగంచి చూడటానికి క్లియర్‌గా ఉండేలా చేస్తుంది దీనిని ఢీఫోగర్ అంటారు. సి.వి.టి అనగా కంటిన్యూయస్లి వేరెబుల్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్ అని అర్థం. తరువాత స్లైడర్‌లో బాలెనొ జీటా గురించి.

బాలెనొ జీటా వేరియంట్ :
స్టీరింగ్ వీల్ మరియు గేర్ మా మార్చే రాడ్ చుట్టూ లెధర్‌తో కుట్టబడి ఉంటుంది, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, పగటి పూట్ కనిపించే యల్.ఇ.డి లైట్లు, ఆటోమేటికి హెడ్‌లైట్లు, ఫాలో మి హోమ్ పంక్షన్, అల్లాయ్ వీల్స్, డ్రైవర్ సీట్ ఎత్తును మార్చుకునే వెసులుబాటు, పుష్ బటన్ స్టార్ట్, కీ లెస్ ఎంట్రి, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి .

ఆల్ఫా బాలెనొ :
ఇంతకు ముందు ఇచ్చిన అన్ని స్పెసిఫికేషన్స్‌తో పాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, రివర్స్ కెమెరా మరియు స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి .

ఇంజన్ ఎంపిక :
మారుతి బాలెనొ నుండి ఎంపిక చేసుకోవడానికి రెండు రకాల ఇంజన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
- 83.1-బిహెచ్‌పి ఉత్పత్త చేయగల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది మ్యాన్యువల్ మరియు సి.వి.టి గేర్ బాక్స్ ఆప్షన్లలో లభించును.
- 88.1-బిహెచ్‌పి ఉత్పత్తి చేయగల 1.3-లీటర్ డీజల్ ఇంజన్, మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో లభించును.
- ఫైర్ సాలిడ్ రెడ్
- బ్లూ ఆబర్న్ ప్రీమియమ్
- ప్రీమియమ్ మెటాలిక్ సిల్వర్
- రే బ్లూ
- ఆర్క్‌టిక్ వైట్ పియర్ల్
- గ్రానైట్ గ్రే
- పొడవు-3,995 ఎమ్ఎమ్
- వెడల్పు-1745 ఎమ్ఎమ్
- ఎత్తు-1500 ఎమ్ఎమ్
- వీల్ బేస్-2,520 ఎమ్ఎమ్
- గ్రౌండ్ క్లియరెన్స్-180 ఎమ్ఎమ్ కలదు

రంగులు :
బాలెనొ లభించు రంగులు
మరియు త్వరలో ఏడు రంగుల్లో లభ్యంకానున్నాయి.

పోటి :
మారుతి బాలెనొ మార్కెట్లో గల హ్యూందాయ్ ఐ10, హోండా జాజ్, మరియు వోక్స్ వ్యాగన్ పోలో కార్లకు గట్టి పోటీగా నిలువనుంది.

కొలతలు :
బాలెనొ యొక్క


Click it and Unblock the Notifications