యస్-క్రాస్ మీద 3 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి సుజుకి
మార్కెట్లో అన్ని వాహన సంస్థలు తమ ఉత్పత్తల మీద ధరను పెంచుతుండగా మారుతి సుజుకి మాత్రం తమ ప్రీమియమ్ క్రాసోవర్ అయిన యస్-క్రాస్ మీద కళ్లు చెదిరే ఆఫర్‌ను ప్రకటించింది. నెక్సా షోరూమ్ ద్వారా మాత్రమే లభించే ఈ ప్రీమియ్ క్రాసోవర్ కారు మీద ఏకంగా రెండు నుండి మూడు లక్షల రపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.
Also Read: మారుతి సుజుకి యస్-క్రాస్ ప్రీమియా ఎడిషన్ విడుదల
మారుతి సుజుకి ఈ యస్-క్రాస్ క్రాసోవర్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పటి నుండి ఓ మోస్తారుగా అమ్మకాలను నమోదు చేసుకుంటోంది. దీనికి కారణం దీని ధర ఎక్కువగా ఉండటం మరియు ఇది కేవలం నెక్సా షోరూమ్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండటం. అయితే దీనిని విడుదల చేసిన ప్రారంభంలో మంచి ఫలితాలను ఇది నమోదు చేసుకుంది.
Also Read: భారతీయ మార్కెట్లోకి మారుతి సుజుకి నుండి వితారా కాంపాక్ట్
మారుతి సుజుకి భారతీయ యస్‌యువి మార్కెట్లోకి సరికొత్త వితారా కాంపాక్ట్ యస్‌యువిని విడుదల చేయనుంది. దీని మీద మారుతి చాలా నమ్మకాలు పెట్టుకున్నట్లు తెలిసింది. అయితే దీనిని 2016 ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్-పోలో ప్రదర్శించనుంది. ఇది మార్కెట్లోకి విడుదల అయితే హ్యుందాయ్ క్రెటాతో పోటి పడనుంది.



Click it and Unblock the Notifications