అక్టోబర్ 26 న విడుదల కానున్న మారుతి సుజుకి బాలెనొ
మారుతి సుజుకి ఎప్పటి నుండో విడుదల చేయాలని చూస్తున్న హ్యాచ్‌బ్యాక్ బాలెనొ, దీని టీజర్‍ని ఇప్పటికే నెట్టింట్లో విడుదల చేశారు. దీనిని ఎప్పుడైనా ఎక్కడైనా విడుదల చేయొచ్చు, అయితే పారిశ్రామిక వర్గాలు మాత్రం అక్టోబర్ 26న విడుదల విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బిమల్ మారుతి నెక్సా డీలర్ మరియు బిమల్ నెక్సా వారు వెబ్ సైట్‌లో గల టీజర్ ని చూశారు దీనిని త్వరలో బెంగళూరులోకి అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. బాలెనొ హ్యాచ్‌బ్యాక్ ను విడుదల చేసిన తరువాత ఇప్పుడు నెక్సాస్ షోరూమ్ నుండి రెండు రకాల మోడల్స్ అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు, అందులో ఒకటి యస్-క్రాస్ మరియు బాలెనొ. విడుదలప్పుడు దీని ధర 7.5 లక్షల నుండి 9.5 లక్షలుగా ఉండనుంది.
మారుతి సుజుకిలో 1.0 లీటర్, బూస్టర్ జెట్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌ని వాడిన మొదటి కార్ బాలెనొ. ఇది 1.3-లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా అందుబాటులోకి రానుంది, మరియు ఇందులో యస్.వి.యస్.హెచ్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంది.
సరికొత్త మారుతి సుజుకి యొక్క బాలెనొకి వై.ఆర్.ఎ హ్యాచ్‌బ్యాక్ అని నామకరణం చేశారు. 2015 ఫ్రాంక్‌ఫర్ట్ లో జరిగిన మోటర్ షోలో దీనిని ప్రదర్శించారు. అయితే ఇది ఇండియాలో లాంచ్ అయినప్పుడు హ్యుండాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ కు గట్టి పోటి ఇవ్వగలదని గట్టిగా నమ్ముతున్నారు.


Click it and Unblock the Notifications








