అదనపు ఫీచర్లతో మారుతి సుజుకి సియాజ్ జెడ్ ప్లస్ వేరియంట్
మారుతి సుజుకి ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న లేటెస్ట్ మిడ్-సైజ్ సెడాన్ 'సియాజ్'లో కంపెనీ తాజాగా ఓ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. మరిన్ని అదనపు ఫీచర్లతో కూడిన 'సియాజ్ జెడ్ ప్లస్' వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది.
ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ సియాజ్ జెడ్‌కు ఎగువన ఈ సియాజ్ జెడ్ ప్లస్ వేరియంట్‌ను విక్రయిస్తారు. మారుతి సుజుకి సియాజ్ జెడ్ ప్లస్ వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
సియాజ్ జెడ్ ప్లస్ వేరియంట్లో లభించే ఫీచర్లు:
- లెథర్ సీట్స్
- లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్
- కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్
- బెల్ట్ లైన్ ఆర్నమెంట్
- బూట్ లిడ్ గార్నిష్
- 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్
- వాయిస్ కమాండ్
- నావిగేషన్ సిస్టమ్

పెట్రోల్ వెర్షన్ సియాజ్‌లో 1373సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 91.15 హార్స్‌పవర్‌ల శక్తిని, 130 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
డీజిల్ ఇంజన్:
డీజిల్ వెర్షన్ సియాజ్‌లో 1248సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 88.47 హార్స్‌పవర్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.
సియాజ్ జెడ్ ప్లస్ వేరియంట్ ధరలు
- సియాజ్ జెడ్ఎక్స్ఐ (పెట్రోల్) - రూ.9.08 లక్షలు
- సియాజ్ జెడ్ఎక్స్ఐ (డీజిల్) - రూ.10.37 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








