మారుతి సుజుకి సియాజ్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల ధర రూ.9.20 లక్షలు.
మారుతి సుజుకి విపణిలోకి సియాజ్ సెడాన్ నుండి లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కారును ప్రవేశపెట్టింది. దీని ధరను రూ. 9.20 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా విడుదల చేశారు. ఈ సరి కొత్త మారుతి సుజుకి సియాజ్ లిమిటెడ్ ఎడిషన్ కారును సియాజ్ యొక్క జడ్ ప్లస్ వేరియంట్ ఆధారంతో రూపొందించినట్లు సమాచారం. మరియు ఈ కారును రెండు ఇంధన వేరియంట్లలో అందిస్తున్నారు.
మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోస: లీటర్‌కు 40 కిలోమీటర్ల మైలేజ్! టయోటా కొత్త కారు ప్రియస్ ఆవిష్కరణ
ఈ సరి కొత్త మారుతి సుజుకి లిమిటెడ్ ఎడిషన్ సియాజ్ కారు గురించి సరింత సమాచారం క్రింది కథనాల ద్వారా తెలుసుకుందా..

మారుతి సుజుకి సియాజ్ ఆర్‌యస్ ధర :
- మారుతి సుజుకి సియాజ్ ఆర్‌యస్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 9.20 లక్షలు ఎక్స్-షోరూమ్,(ఢిల్లీ).
- మారుతి సుజుకి సియాజ్ ఆర్‌యస్ డీజల్ వేరియంట్ ధర రూ. 10.28 లక్షలు ఎక్స్-షోరూమ్,(ఢిల్లీ).

మారుతి సుజుకి ఇంజన్ స్పెసిఫికేషన్స్ :
మారుతి సుజుకి సియాజ్ స్టాండర్డ్ కారులో ఉండే ఇంజన్ ఇందులో కూడా ఉంది. ఇందులో ఉన్న 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ 90 బిహెచ్‌పి మరియు 130 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో ఉన్న 1.3-లీటర్ డీజల్ ఇంజన్ 89 బిహెచ్‌పి మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండింటిలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ కలదు.

ఫీచర్స్ :
మారుతి సుజుకి సియాజ్ ఆర్‌యస్ పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లు రెండు కూడా సియాజ్ జడ్ ప్లస్ మోడల్ యొక్క ఫీచర్లతో వచ్చయి. అయితే అదనంగా ఇందులో కొత్త స్పోర్టివ్ బ్లాక్ ఇంటీరియర్, స్పాయిలర్, సైడ్ స్కర్ట్స్ మరియు గ్రే క్రోమ్‌తో ఫినిషింగ్ చేయబడిన ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

రిలీజ్ వాయిస్ :
మారుతి సుజుకి సియాజ్ ఆర్‌యస్ లిమిటెడ్ ఎడిషన్ కారు విడుదల చేసినపుడు మారుతి సుజుకి మార్కెట్ అండ్ సేల్స్ ఎక్సిక్యుటివ్ డైరక్టర్ మాట్లాడుతు. సియాజ్ ఆర్‌యస్ ఎంతో శక్తివంతమైనదని ఈ మిడ్ సైజ్ సెడాన్ ఖచ్చితంగా భారతీయుల చేత ఆదరించబడుతుందని పేర్కొన్నారు.

భద్రత :
ఇందులో ఉన్న ప్రాథమిక వేరియంట్స్ నుండి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్‌లను మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఎవరయితే మంచి డిజైన్ మరియు స్టైల్‌ను కోరుకుంటారో వారికి ఖచ్చితంగా ఇది సరిపోతుంది.

మారుతి సుజుకి లేటెస్ట్‌గా విడుదల చేసిన మోడల్స్
మారుతి బాలెనొ కారు వేరియంట్స్, సౌకర్యాలు మరియు ఇతర వివరాలు.
మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్ లిఫ్ట్ ఎమ్.పి.వి కారు
మారుతి సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్


Click it and Unblock the Notifications