ఎర్టిగా ఫేస్ లిఫ్ట్‌ కారును విడుదల చేసిన మారుతి సుజుకి: ధర మరియు ఫీచర్స్

By Anil

భారతదేశపు అతి పెద్ద ఆటోమొబైల్ తయారిదారులైన మారుతి సుజుకి మార్కెట్లోకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేసింది. మారుతి సుజుకి ఈ అక్టోబర్ నెలలో దాదాపుగా నాలుగు మోడళ్లను విడుదల చేసింది.
మీ నగరంలో మారుతి సుజుకి ధరలు తెలుసుకోవడానికి.....

భారత్‌లో పండుగ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో మారుతి సుజుకి ఇలా రకరకాల మోడల్స్‌ను విడుదల చేస్తున్నట్లు అవగతం అవుతోంది. అయితే దీనికి సంభందించిన పూర్తి సమాచారం క్రింది స్లయిడర్ల ద్వారా తెలుసుకుందాం పదండి....
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: సరి కొత్త మార్పులతో రానున్న హ్యుందాయ్ క్రెటా.

లభించు రంగులు :

లభించు రంగులు :

మారుతి సుజుకి రెండు కలర్ ఆప్షన్‌లలో వీటిని అందిస్తోంది.

బ్లూ మరియు బీజి అను విభిన్న రంగుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ముందున్న మారుతి ఎర్టిగా కంటే ఇందులో ఎక్కువగా క్రోమ్ మెటల్‌ను ఉపయోగించారు.

 ఫీచర్స్ :

ఫీచర్స్ :

ఇందులో రివర్స్ కెమెరా, న్యావిగేషన్, బ్లూటూత్ మరియు స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌‌‌మెంట్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.

 డిజైన్ :

డిజైన్ :

కొత్త మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్ ముందున్న ఎర్టిగా యొక్క ప్రేరణతో తయారు చేశారు. అయితే ఇందులో ముందువైపున్న ఫ్రంట్ గ్రిల్ లుక్ చాలా బోల్డ్‌గా ఉంటుంది. మరియు దీనిని ఇన్-సింక్ హెడ్‌లైట్స్‌తో మరింత ఆకట్టుకునేలా చేశారు.

 ధర :

ధర :

మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్ లిఫ్ట్ ఎమ్‌పివి ప్రారంభ ధర 5,99,907 రుపాయలు మరియు మారుతి ఎర్టిగా స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్లలో లభిస్తుంది, ఈ వేరియంట్లో అత్యధిక ధర గల మోడల్ కూడా ఇదే. దీని ధర దాదాపుగా 9,25,358 రుపాయలుగా ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్,ఢిల్లీ.

సీటింగ్ ఆప్షన్స్ :

సీటింగ్ ఆప్షన్స్ :

ఇందులో ఉన్న మూడవ వరుస సీటును పూర్తిగా క్రింది వరకు మడిచే అవకాశం ఉంది. అయితే ముందు ఎర్టిగాలో ఉన్న సీటును 50 50 వరకు మాత్రమే మడచవచ్చు. మరియు రెండవ వరుసలో ఉన్న సీటును 60 40 కాన్ఫిగరేషన్‌ వరకు మడిచే అవకాశం ఉంది. ఎక్కువ బూట్ స్పేస్‌ను కూడా ఈ మోడల్‌లో కల్పించారు.

 పోటి :

పోటి :

మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్ లిఫ్ట్ ఎమ్‌.పి.వి కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా మొబిలియో, షెవర్లే ఎంజాయ్ మరియు త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న హ్యుందాయ్ మల్టి పర్పస్ వెహికల్‌కు గట్టి పోటి ఇవ్వనుంది.‌

 భద్రత :

భద్రత :

మారుతి సుజుకి భద్రత పరంగా ప్రారంభ వేరియంట్లలో ఆప్షనల్‌గా భద్రత పరికరాలను అందిస్తున్నారు. మరియు ప్రారంభ వేరియంట్లలో ఆప్షనల్‌గా ముందువైపు రెండు ఎయిర్‌బ్యాగ్‌‌లు, ఇబిడి తో ఉన్న ఎబియస్‌ మరియు ఫోర్స్ ‌లిమిట్ గల సీట్ బెల్ట్‌ వంటి ఎన్నో భద్రత పరికరాలు ఇందులో కల్పించారు.

ఎర్టిగా యస్.యు.వి :

ఎర్టిగా యస్.యు.వి :

మారుతి సుజుకి చెందిన కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను ఈ నెలలోపు విడుదల చేయనున్నారు, వచ్చే ఏడాదికి కాంపాక్ట్ యస్.యు.వి కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కొత్తగా విడుదలైన మారుతి సుజుకి మోడల్స్ :

కొత్తగా విడుదలైన మారుతి సుజుకి మోడల్స్ :

ఈ నెలలో మారుతి సుజుకి క్రింది మోడల్స్‌ను విడుదల చేసింది.

  • మారుతి సుజుకి బాలెనొ కారు
  • ఆల్టో కె10 అర్బన్ ఎడిషన్
  • మారుతి సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్
  • ఈ మూడు కార్లను ఈ నెలలోనే విడుదల చేశారు.

Article Published On: Saturday, October 17, 2015, 15:09 [IST]
English summary
Maruti Suzuki launches the facelifted version of Ertiga MPV at a base price of INR 5,99,907. The Ertiga also gets a Smart Hybrid option as well for 2015 and is their most expensive variant, priced at INR 9,25,358 (ex-showroom, Delhi). This is an introductory offer by the Japanese based automaker.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+