ఏప్రిల్-జూన్ నాటికి మారుతి సుజుకి సూపర్ క్యారీ ఎల్‌సివి
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ), ఓ తేలికపాటి వాణిజ్య వాహనాన్ని (లైట్ కమర్షియల్ వెహికల్) అభివృద్ధి చేస్తున్నట్లు మనం ఇదివరకు పలు కథనాల్లో చదువుకున్నాం.
మారుతి సుజుకి మాతృ సంస్థ, జపాన్‌కి చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ అందిస్తున్న 'క్యారీ' (Carry) ఎల్‌సివి ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త ఎల్‌సివి అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే మారుతి సుజుకి ఈ ఎల్‌సివిని 'వై9టి' (Y9T) అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తోంది. కాగా.. ఇప్పుడు ఈఎల్‌సివి 'సూపర్ క్యారీ' (Super Carry) అనే పేరును ఖరారు చేసినట్లు మాచారం.
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మారుతి తమ ఎల్‌సివిని మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మారుతి సుజుకి సూపర్ క్యారీ ఎల్‌సివి విక్రయాల కోసం కంపెనీ ప్రత్యేకంగా సేల్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది.

మారుతి సుజుకి ఎల్‌సివిలో కంపెనీ అభివృద్ధి చేస్తున్న 0.8 లీటర్ ట్విన్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ ఇంజన్‌ను సుజుకి జపాన్‌లో అభివృద్ధి చేస్తోంది. కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తోనే కాకుండా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన సిఎన్‌జి వేరియంట్లో కూడా ఈ ఎల్‌సివి విడుదల కానున్నట్లు సమాచారం. దీనిని గుర్గావ్ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నారు.
మారుతి సుజుకి సూపర్ క్యారీ ఎల్‌సివి ఈ సెగ్మెంట్లో టాటా ఏస్, మహీంద్రా జియో, పియాజ్జియో ఆపే ట్రక్, అశోక్ లేలాండా దోస్త్ వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది. డీజిల్ వెర్షన్ ధర రూ.4 లక్షల రేంజ్‌లో, సిఎన్‌జి వెర్షన్ ధర రూ.4.5-5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








