త్వరలో రానున్న మారుతీ సుజుకి క్రాసోవర్ : సొంత సైట్ ప్రారంభం.
సియజ్ ప్రీమియం సెడాన్ మోడల్ విజయవంతం అయిన తర్వాత మరిన్ని ప్రీమియం ఉత్పత్తులను విడుదలచేసేందుకు మారుతీ సుజుకి సన్నాహాలు చేస్తోంది. దాంతోపాటు తన ప్రీమియం ఉత్పత్తుల కోసం మరిన్ని ఔట్ లెట్ లను ప్రారంభించే యోచనలో ఉంది.
అతి త్వరలో భారత్ లో మారుతీ సుజుకి క్రాసోవర్ ను తక్కువ కాలంలో ఆవిష్కరించనుంది.మారుతీ సుజుకి క్రాసోవర్ ఈ మధ్య కాలంలో విడుదల చేయబడుతున్న రెండవ ప్రీమియం మోడల్.
ఇప్పుడు తన రానున్న ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పించడం కోసం మారుతీ సుజుకి క్రాసోవర్ ఒక సొంత వెబ్ సైట్ ను తయారుచేసుకుంది. కొనుగోలుదారులు తమ వివరాలను ఆ వెబ్ సైట్ లో నమోదుచేసి మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు.
ఎస్-క్రాస్ భారత్ లో విడుదల చేసే నాటికి పెట్రోల్ ఇంజన్ మరియు డీజల్ ఇంజన్ రెండు ఆప్షన్లతో లభిస్తోంది. ఇప్పటికే దేశమంతా అందుబాటులో ఉన్న ఔట్ లెట్ లలో సియజ్ ప్రీమియంతో పాటు అమ్మకాలు చేపట్టనుంది.

కొన్ని డీలర్ షిప్ లు ఇప్పటికే ప్రీమియం క్రాసోవర్ బుకింగ్ లను ప్రారంభించాయి. హ్యూందాయ్ ఐ20 కంటే బాగా ముందుకు ఎస్-క్రాస్ ను తీసుకెళ్లాలని మారుతీ సుజుకి ప్రయత్నాలు చేస్తోంది.

మారుతీ సుజుకి యొక్క క్రిందటి రకమైన ఎస్ఎక్స్4 మోడల్ నుంచి ఎస్-క్రాస్ ను అభివృద్ధి చేశారు. అంతర్జాతీయంగా ఎస్-క్రాస్ అమ్మకాలు ప్రారంభం కాగా భారత్ లోను త్వరలో ఎస్-క్రాస్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.


Click it and Unblock the Notifications








