మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం!
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, వరుసగా తమ మోడళ్లను అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను అప్‌గ్రేడ్ చేసిన మారుతి సుజుకి, ఇప్పుడు తాజాగా స్విఫ్ట్ డిజైర్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, దేశంలోని కొన్ని అధీకృత మారుతి సుజుకి డీలర్‌షిప్‌లు ఇప్పటికే కొత్త 2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు. ఇప్పటికే, కొన్ని కొత్త స్విఫ్ట్ డిజైర్ కార్లు డీలర్ల వద్దకు కూడా చేరిపోయినట్లు సమాచారం.
తాజా పరిణామాలను చూస్తుంటే.. ఒకటి రెండు వారాల్లోనే కొత్త స్విఫ్ట్ డిజైర్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత స్విఫ్ట్ డిజైర్‌కు కొత్త 2015 స్విఫ్ట్ డిజైర్‌కు డిజైన్ పరంగా పలు మార్పులు చేర్పులు ఉన్నాయి.

ప్రధానంగా, ఫ్రంట్ ప్రొఫైల్‌లో చెప్పుకోదగిన మార్పులు ఉండనున్నాయి. కొత్త ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ గ్రిల్‌పై పెద్ద క్రోమ్ బార్, రీడిజైన్డ్ బంపర్స్, రీడిజైన్డ్ ఫాగ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ హౌసింగ్ చుట్టూ క్రోమ్ గార్నిష్, స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్, కొత్త వీల్స్ డిజైన్ వంటి ఎక్స్టీరియర్ మార్పులు ఉండనున్నాయి. అలాగే, పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్, పవర్ ఫోల్డబిల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, బ్లూటూత్ ఆధారిత ఆడియో సిస్టమ్, కొత్త సీట్ ఫ్యాబ్రిక్స్ వంటి ఇంటీరియర్ మార్పులు ఉండనున్నాయి.
కొత్త స్విఫ్ట్ డిజైర్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ, స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఆఫర్ చేసినట్లుగానే కొత్త స్విఫ్ట్ డిజైర్‌లో కూడా రీట్యూన్డ్ ఇంజన్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇంజన్ పెర్ఫార్మెన్స్, మైలేజే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కొత్త 2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ ఈ సెగ్మెంట్లోని హోండా అమేజ్, టాటా జెస్ట్, హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








