మారుతి సుజుకి స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగొ
భారతదేశపు ప్రముఖ కార్ల తయారి సంస్థ మారుతి సుజుకి. అమ్మకాల పరంగా చూస్తే మారుతి సుజుకి దేశంలో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడపోతున్న కార్లలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మూడవ స్థానంలో ఉంది మరియు ప్రస్తుతానికి ఫోర్డ్ ఫిగొ నుండి గట్టి పోటిని ఎదుర్కుంటోంది. ఫిగొ రాక ముందు స్విఫ్ట్ ఒక వెలుగు వెలిగింది. అయితే ఫోర్డ్ ఫిగొ మరియు స్విఫ్ట్ రెండు కూడా తమ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాయి.
కొత్త ఫోర్డ్ మారుతి సుజుకి స్విఫ్ట్ ని సవాలుగా చేసుకుని స్విఫ్ట్‌కి పోటిగా ఫిగొ హ్యాచ్‌బ్యాక్ ను ప్రవేశ పెట్టింది. త్వరలో ఈ రెండింటి మధ్య ఒక విప్లవం జరిగే సూచకలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్విఫ్ట్ కన్నా ఫిగొలో కొన్ని మంచి ఫీచర్‌లు ఉండటం వలన ఫిగొనే స్విఫ్ట్ కు గట్టిపోటి అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే ఇన్ని సంవత్సరాల పాటు మారుతి సుజుకి స్విఫ్ట్ ను భారత ప్రజలు ఎక్కువగా ఆదరిండానికి గల ముఖ్య కారణాలు ఏమిటి?: అందమైన డిజైన్, మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ, సులభతరమైన సర్వీస్ మరియు నిర్వహణ, ఇది శక్తివంతమైనది ముఖ్యంగా అందరికీ సరసమైనది.
మరింత సమచారం కోసం: ప్రపంచంలో అత్యంత విలువైన 5 కార్ల కంపెనీలు(బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, టయోటా.....)
మరి మారుతి సుజుకి స్విఫ్ట్ కారుకిమ వ్యతిరేకంగా ఫోర్డ్ ఫిగొ ఎలాంటి ధర, పనితీరు, స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ తో వచ్చిందో మరియు? ఇది నిజంగా స్విఫ్ట్‌కు పోటిగా నిలవగలదా ? అనే సమాచారం క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం..

ధర :
మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు:
పెట్రోల్ వేరియెట్స్ రూ. 4.65 లక్షల నుండి మొదలు
డీజల్ వేరియంట్స్ రూ. 5.84 లక్షల నుండి మొదలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఫోర్డ్ ఫిగొ ధరలు:
పెట్రోల్ వేరియంట్స్ రూ. 4.30 లక్షలు నుండి మొదలు
డీజల్ వేరియంట్స్ రూ. 5.30 లక్షల నుండి మొదలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
ధర పరంగా చూస్తే ఫిగొ ధర కాస్త తక్కువగానే ఉంది

డిజైన్:
స్విఫ్ట్ :
స్విఫ్ట్ యొక్క డిజైన్ అందరికి బాగా తెలిసిన డిజైన్, దీనిని విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి దీని డిజైన్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే ఇంజన్ పరంగా కొత్త వాటిని అప్‌గ్రేడ్ చేశారు. దీనిలో గల సైడ్ ల్యాంప్స్ హెడ్ పక్కన డిజైన్ చేయడం వలన మంచి లుక్ వచ్చింది మరియు టాప్ పైన గల వాలుతల నిర్మాణం దీనిని స్పోర్ట్స్ కార్ అని పిలిపించుకునేలా చేసింది.

ఫోర్డ్ ఫిగొ డిజైన్ :
ఫోర్డ్ ఫిగొను పాత కాలం నాటి మోడల్‌తో పోల్చగా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్‌లో ఉన్న కారు కొత్త లుక్‌తో వచ్చింది. దీనికి ముందువైపున ఆస్టన్ మార్టిన్ ఇన్‌స్పైర్డ్ ఫ్రంట్ గ్రిల్ మరియు బోల్డ్ డిజైన్ కలదు. దీనిని ఫోర్డ్ ఫిగొ ఆస్పైర్ సెడాన్ నుండి తీసుకు న్న ప్రేరణలతో దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. దీనికి ముందు గల హెడ్ ల్యాంప్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఫీచర్స్:
స్విఫ్ట్ ఫీచర్స్ :
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్
- బ్లూటూత్ కనెక్టివిటి గల ఆడియో సిస్టమ్
- స్టీరింగ్ పై నిర్మించి ఉన్న ఆడియో కంట్రోల్స్
- రియర్ ఫాగ్ ల్యాంప్స్
- కీ లెస్ ఎంట్రీ (టాప్ వేరియంట్ లో మాత్రమే)
- ఎలక్ట్రానికల్ గా ఆపరేట్ చేయబడు ఒఆర్‌విఎమ్ (వైనక్కి చూడటం కోసం ఉపయోగించే బయటి అద్దం)
- డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్
- ఫోర్డ్ యస్.వై.యన్.సి మల్టీమీడియా సిస్టమ్
- మై కీ ( సీట్ బెల్ట్ పెంచుకోవడానికి, వెహికల్ వేగాన్ని అదుపులో ఉంచుకోవడానికి మరియు ఆడియో సిస్టమ్ కంట్రోల్ చేయడానికి) ఈ కీ ఉపయోగపడుతుంది.
- మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకోవడానికి
- శాటిలైటి న్యావిగేషన్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి.
- 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (83 బిహెచ్‌పి, 114 ఎన్ఎమ్ టార్క్, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్)
- 1.3-లీటర్ డీజల్ ఇంజన్ (74 బిహెచ్‌పి, 190 ఎన్ఎమ్ టార్క్, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్)
- 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (87 బిహెచ్‌పి, 112 ఎన్ఎమ్ టార్క్, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్)
- 1.5-లీటర్ లీటర్ ఇంజన్ (99 బిహెచ్‌పి, 215 ఎన్ఎమ్ టార్క్, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్)
- 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (110 బిహెచ్‌పి, 136 ఎన్ఎమ్ టార్క్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్)
- పెట్రోల్ ఇంజన్ : 20.4 కిలోమీటర్/లీటర్
- డీజల్ ఇంజన్ : 25.2 కిలోమీటర్/లీటర్
- 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ : 18.16 కిలోమీటర్/లీటర్
- 1.5-లీటర్ లీటర్ ఇంజన్ : 25.83 కిలోమీటర్/లీటర్
- 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ : 17 కిలోమీటర్/లీటర్

ఫిగొ ఫీచర్స్ :

ఇంజన్ స్పెసిఫికేషన్స్ :
మారుతి సుజుకి స్విఫ్ట్:

ఫోర్డ్ ఫిగొ:

మైలేజ్ :
మారుతి సుజుకి స్విఫ్ట్

ఫోర్డ్ ఫిగొ :

భధ్రత:
మారుతి సుజుకి స్విఫ్ట్ :
ప్రస్తుత రోజుల్లో భధ్రత కు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు, స్విఫ్ట్ బేస్ మోడల్‌లో కేవలం సీటు బెల్ట్ మాత్రమే కలిగి ఉంది. దీని టాప్ మోడల్‌లో రెండు ఎయిర్ బ్యాగ్‌లు, రివర్స్ సెన్సార్స్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఎబియస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి) మరియు బ్రేక్ అసిస్ట్ ఇందులో ఉన్నాయి.

ఫోర్డ్ ఫిగొ:
ఇందులో డ్రైవర్ కోసం స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్, టాప్ వేరియంట్‌లో అయితే కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, ఏబియస్, ఇబిడి, ఎమర్జెన్సి అసిస్ట్, పెరిమీటర్ అలారమ్ మరియ సీట్ బెల్ట్ రిమైండర్.

తీర్పు :
మీరు ఏమనుకుంటున్నారు ? సరే ఫోర్డ్ పిగొ తీసుకోండి. ఇందులో ఉత్తమమైన పరికరాలు, ఉత్తమమైన భధ్రత, ఉత్తమమైన ఇంజన్ ఎంపిక అయితే పెట్రోల్ ఇంజన్ కాస్త తక్కువ మైలేజి ఇస్తుంది. మరియు ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు కాని స్విప్ట్ లో ఈ అవకాశం లేదు. అందుకే మేము ఫోర్డ్ ఫిగొ ని ఎంపిక చేస్తాము.


Click it and Unblock the Notifications








