మారుతి సుజుకి ఈకో ఫేస్‌లిఫ్ట్ వస్తోంది!
జపనీస్ కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న మల్టీ పర్పస్ వెహికల్ 'ఈకో' (Eeco)లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
రిఫ్రెష్డ్ ఈకో విషయానికి వస్తే.. డిజైన్ పరంగా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. బెటర్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఇంటీరియర్, ఎక్స్టీరియర్లను కూడా మెరుగు పరచనున్నారు. టాప్-ఎండ్ వేరియంట్లో ఎయిర్ కండిషనింగ్‌ను కూడా ఆఫర్ చేయవచ్చు. అలాగే, సేఫ్టీ ఫీచర్ల పరంగా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి ఈకో పెట్రోల్, సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో బిఎస్-4 వెర్షన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 73 బిహెచ్‌పిల శక్తిని, 101 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
మారుతి ఈకో ప్రస్తుతం 5 వేరియంట్లలో లభిస్తోంది. విపణిలో వీటి ధరలు రూ.3.37 లక్షల నుంచి రూ.4.44 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). మారుతి ఈకో వాహనాన్ని వ్యక్తిగత మరియు వాణిజ్య ప్రయోజనం కోసం వినియోగిస్తుంటారు.


Click it and Unblock the Notifications








