అయ్యయ్యో..! మారుతి ఆల్టో రీకాల్.. ఇంతకీ సమస్యేంటి..?

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న చిన్న కారు ఆల్టోలో చిన్నపాటి సమస్య తలెత్తింది. కంపెనీ విక్రయించిన ఆల్టో 800, ఆల్టో కె10 మోడళ్లలో కుడిచేతి వైపు ఉండే డోర్ ల్యాచ్ (హ్యాండిల్)ను చెక్ చేసేందుకు కంపెనీ మొత్తం33,098 యూనిట్ల ఆల్టో కార్లను కార్లను రీకాల్ చేసింది.

ఈ మొత్తం 33,098 కార్లలో 19,780 యూనిట్లు ఆల్టో 800 కార్లు కాగా, 13,318 యూనిట్లు ఆల్టో కె10 కార్లు ఉన్నట్లు కంపెనీ వివరించింది. డిసెంబర్ 8, 2014వ తేదీ నుంచి ఫిబ్రవరి 18, 2015వ తేదీ మధ్య కాలంలో ఉత్పత్తి అయిన ఆల్టో కార్లు మాత్రమే ఈ రీకాల్‌కు వర్తిస్తాయి.

Maruti Suzuki To Recall Alto

ఈ రీకాల్‌కు మారుతి సుజుకి డీలర్లు తమ కస్టమర్లను సంప్రదిస్తున్నారు. పైన తెలిపిన సమయంలో తయారైన ఆల్టో కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లు వారికి సమీపంలో ఉండే అధీకృత మారుతి సుజుకి డీలరు కానీ లేదా www.marutisuzuki.com వెబ్‌సైట్‌ని సందర్శించి కానీ తమ కార్లు రీకాల్‌కు వర్తిస్తాయో లేవో తెలుసుకోవచ్చు.

డీలర్‌షిప్‌కు తీసుకువచ్చే ఆల్టో కార్లను టెక్నీషియన్లు ఉచితంగా చెక్ చేసి, లోపపూరితమైన భాగాన్ని ఉచితంగా రీప్లేస్ చేస్తారు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 11, 2015, 9:42 [IST]
English summary
Maruti Suzuki, India's largest carmaker will recall 33,098 units of the Alto 800 and the Alto K-10 to inspect right hand door latch assembly.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+