2016 ఆటో ఎక్స్ పోలో మారుతి సుజుకి విటారా చిన్నఎస్‌యువి ఎంట్రీ

By Anil

భారత దేశపు నెం. 1 ప్యాసింజర్ వాహనాల కంపెనీ మారుతి సుజుకి. మన దేశ రాజధానిలో 2016 ప్రారంభంలో ఆటో ఎక్స్‌పో జరగనుంది. అందులో మారుతి సుజుకి తన చిన్న సైజు విటారా యస్‌యువిని మనకు పరిచయం చేయబోతోంది.

అయితే మారుతి సుజుకి 2015 టోక్యో మోటార్ షోలో ఈ కారును ప్రదర్శించింది. మారుతి సుజుకి ఈ యుటిలిటి యస్‌యువి ని రానున్న కొత్త సంవత్సరంలో మన ముందుకు రానుంది.
Also Read: మీ నగరంలో మీకు నచ్చిన మారుతి కార్ల ధరలు తెలుసుకోండి.

మారుతి సుజుకి విటారా గురించి మరిన్ని విషయాలు క్రింది స్లైడర్‌ల ద్వారా తెలుసుకుందా రండి.

పోటి

పోటి

ఇది ఇంకా మార్కెట్లోకి రాకనే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాహనాలతో పోటీ పడుతోంది. ఇది హ్యుందాయ్ క్రెటా, రెనొ డస్టర్ మరియు హోండా యొక్క అప్ కమింగ్ మోడల్ బిఆర్-వి వంటి కార్లతో పోటి పడనుంది.

ఉపయుక్తమైన వాహనాలను

ఉపయుక్తమైన వాహనాలను

మారుతి భారతీయ మార్కెట్లోకి ఎన్నో ఉపయుక్తమైన వాహనాలను అందిస్తోంది. అందులో ఈ మద్యనే విడుదలైన మారుతి బాలెనొ ఒక ఉదాహరణ. దీని పరంగా చూస్తే మారుతి సుజుకి మెల్లగా మిగతా కంపెనీల వాహనాలకు అన్ని సెగ్మెంట్ల నుండి పోటిని ఇస్తోంది.

మిని యస్‌యువి

మిని యస్‌యువి

దేశంలో అతి చిన్న కార్లను ఎక్కువగా అందిస్తున్న కంపెనీ ఏది అంటే మారుతి సుజుకి అని టక్కుమని చెబుతారు. మారుతి సుజుకి అదే తరహాలో చిన్న యస్‌యువి ద్వారా మరింత ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఈ విటారా యస్‌యువిని విడుదల చేస్తోంది.

పన్ను ఉపశమనం

పన్ను ఉపశమనం

విటారా యస్‌యువి కారును నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండేట్లు రూపొందించారు. దీని వలన ఇది ప్రభుత్వం విధించి పన్ను నుండి కొంత ఉపశమనం పొందుతుంది. తద్వారా దీని ధర తగ్గే అవకాశం కూడా ఉంది.

కాన్సెప్ట్

కాన్సెప్ట్

2014 సంవత్సరంలో ప్యారిస్‌లో జరిగిన మోటార్ షోలో ప్రదర్శింపబడిన ఐవి-4 కాన్సెప్ట్ తో ఈ మారుతి సుజుకి విటారా కారును రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంజన్

ఇంజన్

మారుతి సుజుకి తన విటారా మోడల్ ను క్రింద గల ఇంజన వేరియంట్లలో అందివ్వనుంది.

  • 1.4-లీటర్ వివిటి పెట్రోల్
  • 1.3-లీటర్ మల్టీజెట్ డీజల్
  • 1.6-లీటర్ మల్టీజెట్ డీజల్
  • ధర

    ధర

    మారుతి సుజుకి‌కు చెందిన విటారా యస్‌యువి కారు ధర సుమారుగా 10 లక్షల వరకు ఉండనున్నట్లు అంచనా.

    మరిన్ని మారుతి కార్ల గురించి తెలుసుకోండి.

    మరిన్ని మారుతి కార్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 4, 2015, 15:21 [IST]
English summary
Maruti Suzuki Vitara India 2016 Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+