మెర్సిడెస్ బెంజ్ నుండి ఎయమ్‌జి జిటి యస్ సూపర్ కారు విడుదల: ధర రూ. 2.25 కోట్లు.

By Anil

ప్రముఖ దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అత్యంత ఖరీదైన వాహనాలను అందించడంలో తనకు మరెవరు సాటిరారని నిరూపించుకుంది. మెర్సిడెస్ బెంజ్ ఈ నెల 24 న మన భారతీయ మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ ఎయమ్‌జి జిటి యస్ మోడల్ కారును విడుదల చేయనుంది.
మరిన్ని ఆశక్తికరమైన విషయాలు: భారతీయ మార్కెట్లోకి మారుతి సుజుకి నుండి వితారా కాంపాక్ట్ యస్‌యువి కారు.

మెర్సిడెస్ బెంజ్ ఎయమ్‌జి జిటి యస్ మోడల్ కారును ఇంతకు ముందు 2014 ప్యారిస్ లో జరిగిన మోటార్ షోలో ప్రదర్శించింది. ఆ తరువాత జరుగుతూ వచ్చిన మోటార్ షోలో లలో ప్రజర్శించాలని అనుకున్నప్పటికి కుదరలేదు. అయితేనేం మన దేశంలో ఇది విడుదలకు సిద్దమైపోయింది.

అత్యంత ఖరీదైన ఈ కారులో ఉన్న సంగతులేంటో తెలుసుకుందామా? అయితే ఏది క్రింద గల స్లైడర్‌ల మీద ఓ కన్నేయండి.

14వ మోడల్

14వ మోడల్

మెర్సిడెస్ బెంజ్ సంస్థ వారు 2015 సంవత్సరానికి గాను భారతీయ మార్కెట్లోకి 15 మోడల్లను విడుదల చేయాలని భావించింది. అందులో భాగంగానే ఇప్పుడు విడుదల చేయబోతున్న ఎయమ్‌జి జిటి యస్ మోడల్ కారు 14 వది కానుంది.

 లభించు వేరియంట్లు

లభించు వేరియంట్లు

ఈ సూపర్ కారు రెండు రకాల వేరియంట్లలో లభించనుంది.

ఎయమ్‌జి జిటి మరియు జిటి యస్. ఈ రెండు మోడల్స్ కూడా మెర్సిడిస్ బెంజ్ వారి రేసింగ్ ఉత్పత్తుల ప్రేరణతో రూపొందించబడ్డాయి.

భద్రత

భద్రత

ప్రస్తుతం ఎయమ్‌జి జిటి యస్ కారులో గల భద్రత అంశాలు అన్ని కూడా ఫార్ములా వన్ ఛాంపియన్‌షిప్ నుండి పొందినది. అంటే భద్రత విషయంలో ఏ మాత్రం రాజీపడలేదన్నమాట

ఇంజన్

ఇంజన్

మెర్సిడెస్ బెంజ్ వారి ఈ సూపర్ కారులో 4.0-లీటర్ వి8 ట్విన్-టర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 503బిహెచ్‌పి మరియు 650 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిటి యస్ సూపర్ కారులో గల ఇంజన్ 7-స్పీడ్ ఎఎమ్‌జి స్పీడ్ షిప్ట్ డిసిటి గేర్ బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంది.

అత్యధిక వేగం

అత్యధిక వేగం

ధర మాత్రమే కాదు దీని వేగం కూడా అధికమే. ఈ సూపర్ కారు కేవలం 3.8 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్లు వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని అత్యధిక వేగం గంటకు 310 కిలోమీటర్లు వేగంతో దూసుకెల్తుంది.

ధర

ధర

మెర్సిడెస్ బెంజ్ ఎయమ్‌జి జిటి యస్ కారు ధర అంతర్జాతీయంగా 1,29,900 అమెరికా డాలర్లు మన దేశం రుపాయల్లో దీని విలువ 86 లక్షలు. ఇక ఇది మన దేశానికి వచ్చిన తరువాత దీని ధర ఎంతో తెలుసా ? రూ. 2.25 కోట్లు, అనగా రెండు కోట్లు 25 లక్షల రుపాయలుగా ఉండనుంది.

ఎయమ్‌జి జిటి3 మోడల్

ఎయమ్‌జి జిటి3 మోడల్

మెర్సిడెస్ బెంజ్ నుండి మరొక మోడల్ కారు రాబోతున్నది. దాని పేరు ఎయమ్‌జి జిటి3 దీనిని మెర్సిడెస్ బెంజ్ వచ్చే ఏడాది భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

సిబియు

సిబియు

ఈ కారును జర్మనీలో తయారుచేసి భారతేశానికి దిగుమతి చేసుకుని అమ్మకాలు చేపట్టనున్నారు. అయితే భారత్‌కు దిగుమతి చేసే అన్ని వాహనాలను కంప్లీట్లి బిల్ట్ యునిట్ ఇన్ ఇండియాగా చెపుతున్నారు.

మరిన్ని మెర్సిడెస్ బెంజ్ కార్ల గురించి తెలుసుకోండి.

More from DriveSpark

Article Published On: Monday, November 23, 2015, 16:31 [IST]
English summary
Mercedes-Benz AMG GT S Supercar Launching In India On Nov. 24
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+