భారతీయ మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ ఫేస్ లిప్ట్ విడుదల ధర రూ. 24.95 లక్షలు.
జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతీయ మార్కెట్లోకి తన ఎ-క్లాస్ ఫేస్ లిఫ్ట్ లగ్జరీ సెడాన్ కారును విడుదల చేసింది. భారతీయ మార్కెట్‌లో 2015 సంవత్సరానికి గాను 15 మోడల్స్‌ను విడుదల చేయాలని అనుకున్న మెర్సిడెస్ బెంజ్ కోరిక ఈ ఎ-క్లాస్ ఫేస్ లిఫ్ట్ కారు విడుదలతో తీరిపోయింది.
Also Read: దిమ్మతిరిగే ధరకు కారును విడుదల చేయనున్న మెర్సిడెస్ బెంజ్
మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడిప్పుడే భారతీయ మార్కట్లో పెద్ద పెద్ద అడుగులు వేస్తోంది. ఎందుకంటే ఇది మన మార్కెట్లోకి తమ ఉత్పత్తులను విడుదల చేసే తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. మరియు 2012 నుండి ప్రస్తుతం వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 5 లక్షల యూనిట్ల లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ కార్లను అమ్మింది.
మన దేశంలోకి 15 వ ఉత్పత్తిగా విడుదలైన మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ ఫేస్ లిఫ్ట్ కారు యొక్క అన్ని వివరాలను క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి...

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ ఫేస్ లిప్ట్ ధరలు
- మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ ఎ 180 స్పోర్ట్ పెట్రోల్ ధర రూ. 24.95 లక్షలు.
- మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ ఎ 200 డి డీజల్ ధర రూ. 25.95 లక్షలు.
- 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్
- 2.2-లీటర్ డీజల్ ఇంజన్
- ఎనిమిది అంగుళాల పరిమాణం గల తాకే తెర
- ఇన్ఫోటైన్‌మెంట్
- స్మార్ట్ ఫోన ఇంటిగ్రేషన్
- ఆపిల్ ప్లే మరియు మిర్రర్ లింక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో గల సీట్లను మరియు డ్యాష్ బోర్డ్‌ను కొత్త మెటీరియల్ ఉపయోగించి తయారుచేశారు.
- ఎలబైట్ గ్రీన్
- సిర్రస్ వైట్
- జూపిటర్ రెడ్
- కాస్మస్ బ్లాక్
- పోలార్ సిల్వర్
- ఆనంద్ మహీంద్ర గురించి ఆసక్తికరమైన విషయాలు
- సేఫ్టీలో దీనికి సాటి మరొకటి లేదు
రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ముంబాయ్ గా ఉన్నాయి.

డిజైన్ :
ఈ మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ ఫేస్ లిఫ్ట్ కారు పాత జనరేషన్ కారు కన్నా కొన్ని కొత్త మార్పులతో విడుదల అయ్యింది. ఇందులో కొత్తగా డిజైన్ చేసిన బంపర్, హెడ్ లైట్స్, టెయిల్ ల్యాంప్స్ మరియు ఓవరాల్ డిజైన్ ఓ మోస్తారుగా కొత్తగా అనిపిస్తుంది.

ఇంజన్ వివరాలు:
మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ ఫేస్ లిఫ్ట్ కారు రెండు రకాల ఇంజన్ ఆప్షన్‌లలో లభించనుంది.

పవర్ మరియు ట్రాన్స్‌మిషన్ :
1.6-లీటర్ గల ఇంజన్ దాదాపుగా 121బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ అత్యధిక టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 2.2-లీటర్ గల ఇంజన్ దాదాపుగా 135 బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ అత్యధిక టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ రెండు ఇంజన్‌లు 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్స్:

లభించు రంగులు:
ఫేస్ లిఫ్ట్ ఎ-క్లాస్ కారు ఐదు విభిన్న రంగుల్లో లభించనుంది

భద్రత :
లగ్జరీ కార్ల బధ్రత పరమైన ఫీచర్లు బారీగా ఉంటాయి.
అందులో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, అటెన్షన్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్(బిఎఎస్), ఎలక్ట్రానికి స్టెబిలిటి ప్రొగ్రామ్ (ఇఎస్‌పి), టైర్ ప్రెస్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ మరియు అడాప్టివ్ బ్రేకింగ్ వంటి ఆధునాతనమైన భద్రత ఫీచర్లు ఉన్నాయి.

ఫోటి :
మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ ఫేస్ లిఫ్ట్ కారు వోల్వో వి40 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 వంటి మోడల్స్‌కు గట్టి పోటిగా నిలవనుంది.



Click it and Unblock the Notifications








