మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎస్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో నేడు (మార్చ్ 25, 2014) రెండు సరికొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. అందులో ఒకటి మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎస్, మరొకటి మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ కన్వర్టిబల్.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా విడుదల చేసిన ఈ కొత్త సిఎల్ఎస్ కారును కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియూ) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. ఫలితంగా ఈ మోడల్ ధర అధికంగా ఉండనుంది.

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎస్ కారు ధర రూ.76.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎస్ కారులో 2.1 లీటర్, ఫోర్-సిలిండర్, డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 267 హెచ్‌పిల శక్తిని, 500 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎస్ ఫీచర్లు:
- మల్టీబీమ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్
- 8-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్
- 14-స్పీక్ హార్మన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్
- శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్
- ఇంటర్నెట్ సౌలభ్యం

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ సేఫ్టీ ఫీచర్లు:
- ఎనిమిది ఎయిర్‌బ్యాగ్స్
- యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- బ్రేక్ అసిస్ట్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్
- యాంటీ-స్లిప్ రెగ్యులేషన్
- హిల్ స్టార్ట్ అసిస్ట్
- అటెన్షన్ అసిస్ట్


Click it and Unblock the Notifications








