మెర్సిడెస్ బెంజ్ ఈ 400 క్యాబ్రియో విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో నేడు (మార్చ్ 25, 2014) రెండు సరికొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. అందులో ఒకటి మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎస్, మరొకటి మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ కన్వర్టిబల్ (క్యాబ్రియో).
మెర్సిడెస్ బెంజ్ ఇండియా విడుదల చేసిన కొత్త ఈ 400 క్యాబ్రియో (కన్వర్టిబల్) కారును కూడా కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియూ) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. ఫలితంగా ఈ మోడల్ ధర కూడా అధికంగా ఉంటుంది.

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈ 400 క్యాబ్రియో ధర రూ.78.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
మెర్సిడెస్ బెంజ్ ఈ 400 క్యాబ్రియో కారులో 3.0 లీటర్, ట్విన్-టర్బో, వి6 ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 333 హెచ్‌పిల శక్తిని, 480 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
మెర్సిడెస్ బెంజ్ ఈ 400 క్యాబ్రియో ఫీచర్లు:
- 7-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్
- 14-స్పీక్ హార్మన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్
- శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్
- పార్కింగ్ ప్యాకేజ్
- 360 డిగ్రీ కెమెరా
- యాక్టివ్ పార్కింగ్ అసిస్టెన్స్

మెర్సిడెస్ బెంజ్ ఈ 400 క్యాబ్రియో సేఫ్టీ ఫీచర్లు:
- తొమ్మిది ఎయిర్‌బ్యాగ్స్
- యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- బ్రేక్ అసిస్ట్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్
- యాంటీ-స్లిప్ రెగ్యులేషన్
- హిల్ స్టార్ట్ అసిస్ట్
- అటెన్షన్ అసిస్ట్


Click it and Unblock the Notifications








