మెర్సెడెస్ బెంజ్ జీ500 4×4²ఉత్పత్తి కన్ఫార్మ్ (ధృవీకరణ).
జర్మని కార్ల తయారీ సంస్థ మెర్సెడెస్ బెంజ్ జీ500 4×4²ఎస్.యూ. వీ. ఉత్పత్తిని ధృవీకరించింది. ఇది 6×6'స్థానాన్ని భర్తీ చేయనుంది. దీని ధర జర్మనీలో 226,100 యూరోలుగా ఉంది.
మెర్సెడెస్ బెంజ్ జీ500 4×4²ను మొదట 2015 గెనీవా మోటార్ షోలో ఆవిష్కరించింది.చివరికి ఉత్పత్తిని ధృవీకరించి పచ్చజెండా ఊపింది.

4.0 లీటర్, 422 హెచ్.పీ మరియు 610 ఎన్ఎమ్ ల టార్క్ ను ఉత్పత్తి చేయగల శక్తి వంతమైన వీ8 ఇంజన్ కలిగి ఉంది. ఇంజన్ చిన్నదిగా మరియు సమర్థవంతమైనదిగా ఉండేందుకు ఇంటర్నల్ గా మౌంట్ చేయబడిన టర్బోలతో ఇంజన్ తీర్చిదిద్దబడింది.

అత్యధికంగా ఆఫ్ రోడ్ సామర్థం కోసం పోర్టల్ యాక్సిస్ ఏర్పాటు చేయడ్డాయి. సాధారణ జీ500 తో పోలిస్తే అవి 45 సెం.మీ నుంచి 24 సెం.మీల ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ను అందించేందుకు తోడ్పడుతాయి. మెర్సెడెస్ బెంజ్ జీ500 4×4² 1 మీటర్ నీటిలో సునాయాసంగా పరుగెత్తగలదు.


Click it and Unblock the Notifications








