2016 లో విడుదలకు సిద్దమైన మెర్సిడెస్ బెంజ్ జియల్ఇ 450 ఎయమ్‌జి కూపే
భారతీయ మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ ఈ యేడు దాదాపుగా 15 మోడల్స్‌ను విడుదల చేసింది. కారణం 2015 అను సంవత్సరపు సంఖ్యలో చివరి నంబరు 15 కోసం ఇలా 15 మోడల్స్‌ను ప్రవేశ పెట్టారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం గడవకనే 2016 లో సరికొత్త జియల్‌ఇ 450 ఎయమ్‌జి కూపే కారును విడుదల చేస్తున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ప్రకటించింది.
దీనిని బట్టి చూస్తే భారతీయ మార్కెట్లో లగ్జరీకార్ల విక్రయాలు పెరిగాయని చెప్పవచ్చు. మెర్సిడెస్ బెంజ్ సంస్థ దీనిని దృష్టిలో ఉంచుకుని మరొక కారును విడుదల చేయడానికి సిద్దమైపోయింది.

విడుదల
మెర్సిడెస్ బెంజ్ వారు సరికొత్త కూపే కారును 2016 సంవత్సరం జనవరి 12 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మొదటి మోడల్
మెర్సిడెస్ బెంజ్ నుండి విడుదల అవుతున్న ఈ కూపే కారు 2016 లో జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ వారి మొదటి ఉత్పత్తి కావడం గమనార్హం. ఇక మెర్సిడెస్ తమ యమ్‌ఎల్-క్లాస్ లో గల అన్ని ఉత్పత్తులను కూడా జియల్‌ఇ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అందివ్వనున్నారు.

కంప్లీట్లి బిల్ట్ యూనిట్
భారత్‌లోకి మెర్సిడెస్ బెంజ్ విడుదల చేయనున్న గొప్ప పని తీరు కనబరిచే యస్‌యువి కారును పూర్తిగా కంప్లీట్లి బిల్ట్ యూనిట్ ఆప్షన్‌తో తయారయినది. ఇక నుండి మెర్సిడెస్ బెంజ్ వారు అంతర్జాతీయంగా విడుదల చేసే ప్రతి మోడల్‌ను కూడా భారతీయ మార్కెట్లోకి విడుదలల చేస్తున్నట్లు తెలిపారు.

ఇంజన్
ఈ జియల్‌ఇ 450 ఎయమ్‌జి కూపే కారులో 3.0-లీటర్ వి6 బిఐ-టర్భో పెట్రోల్ ఇంజన్‌ను అందించారు.

పవర్
మెర్సిడెస్ బెంజ్ వారి కూపేలో కారులో గల అత్యంత శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 357 బిహెచ్ పవర్ మరియు 520 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్త చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్
ఇందులో 4-మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలదు. ఈ సిస్టమ్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ను కలిగి ఉంది.

ఇంటీరియర్
జియల్‌ఇ 450 ఎయమ్‌జి కూపే కారులోని ఇంటీరియర్ దాదాపుగా జియల్‌ఇ మోడల్‌ను పోలి ఉంటుంది. దీనితో పాటు జియల్‌ఇ అనే బ్యాడ్జ్ పేరు మీ హుందాతనానికి అద్దం పడుతుంది.

- కార్ల్ బెంజ్- ది గాడ్ ఆఫ్ ఆటోమొబైల్స్
- విడుదలకు సిద్దమైన మెర్సిడెస్-బెంజ్ ఫేస్ లిఫ్ట్ ఎ-క్లాస్
- మెర్సిడెస్ బెంజ్ సూపర్ హై డెక్ బస్సు విడుదల


Click it and Unblock the Notifications








