ఆడి తర్వాత ఎస్టేట్ మోడళ్లను అందించనున్న మెర్సెడెస్ బెంజ్ ఇండియా
ఆడి తన ఆర్ఎస్6 అవాంట్ ను ఆడి ఇటీవల భారత్ లో విడుదలచేసింది. ఇదే ఆడి అందించిన తొలి ప్రాధాన్యత కలిగిన స్టేషన్ వ్యాగన్. అయితే యువ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు మరిన్ని స్టేషన్ వ్యాగన్ లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది.
జర్మన్ తయారీదారులకు భారత్ లో నంబర్ 1 గా నిలవడానికి చాలా భయంకరమైన పోటీ ఉంది. భారత ప్రీమియం లగ్జరీ కార్ సెగ్మెంట్లో మూడింటి మధ్య పోటీ నడుస్తోంది.

భారత్ లో ఆధిపత్యం కోసం ఆడి, బీ.ఎమ్.డబ్ల్యూ, మెర్సెడెస్ బెంజ్ యుద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు "మూడు పాయింట్ల స్టార్" కూడా రెండు కొత్త ఎస్టేట్ స్టేషన్ వ్యాగన్ లను తొలి సారి భారత్ లో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది.
అదే మాదిరిగా మెర్సెడెస్ బెంజ్ ఈ-క్లాస్, సీ-క్లాస్ ఎస్టేట్ వ్యాగన్ మోడళ్లను భారత్ లో ప్రవేశపెట్టాలని ఉంది. భారత్ లో ఎస్టేట్ వ్యాగన్ ల మధ్య మొదలయ్యే పరస్పర పోటీ చూడటానికి ఆసక్తికరంగా ఉండనుంది.

మెర్సెడెస్ బెంజ్ మోడళ్లని భారత్ లో ప్రవేశపెట్టేందుకు తొలిసారి భారత మార్కెట్లో పరీక్షించనుంది. ఆ రకాల్లో అందిస్తున్న ఇంజన్ కు సంభందించిన వివరాలను ఇంకా వెళ్లడించలేదు.

మెర్సెడెస్ బెంజ్ లో ప్రస్తుతమున్న ఈ-క్లాస్, సీ-క్లాస్ మోడళ్లలో మాదిరి ఇంజన్ లనే కొత్తగా వచ్చే ఎస్టేట్ వ్యాగన్లలో వినియోగించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications