మెర్సెడెస్ నుంచి కొన్ని కొత్త మోడళ్లు
మెర్సెడెస్ బెంజ్ లగ్జరీ కార్ సెగ్మెంట్లో తన ఉనికిని చాటుకునేందుకు వాహనాలను అభివృద్ధి చేస్తూ భారత్‌లో విడుదల చేస్తోంది.
ఈ రోజుల్లో ఆ కంపెని కొన్ని కొత్త మోడళ్లను భారత్‌కు పరిచయం చేసింది. మెర్సెడెస్ బెంజ్ ఒకే రోజే మూడు మోడళ్లను ప్రపంచానికి విడుదల చేయనుంది.
ఈ జర్మన్ కార్ తయారీ సంస్థ ఎస్500 కూపే, జి63 ఏఎమ్‌జి మరియు ఎస్63 ఏఎమ్‌జి కూపేలను ఈ నెల 30న ఢిల్లీలో విడుదలచేయనుంది.
వీటి గురించిన మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం.....

మెర్సెడెస్ బెంజ్ ఎస్500 కూపే :
ఇది 700ఎన్ఎమ్ టార్క్, 450 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేయగల 4.7లీ, .ట్విన్ టర్బో వి8 ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది కేవలం 4.6 సెకండ్లలో 100 కి.మీ/హవర్ వేగాన్ని అందుకోగలదు. దీని మైలేజ్ 10 కి.మీ/లీటర్.

మోటార్ సైకిల్ మాదిరిగా అడాప్టివ్ సస్పెన్షన్ టెక్నాలజితో డిజైన్ చేయబడింది. ఇది 15 నుంచి 100 కి.మీ/హవర్ వేగం వద్ద పనిచేస్తుంది.

మెర్సెడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి :
జి63 ఏఎమ్‌జి మనం ఎప్పుడు చూడనటువంటి క్రేజి కలర్‌లో విడుదల కానుంది. ఇది 760ఎన్ఎమ్ టార్క్, 536 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేయగల 5.5లీ, .వి8 ఇంజన్‌ను కలిగి ఉంది.

ఇది కేవలం 5 సెకండ్లలో 100 కి.మీ/హవర్ వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ 212 కి.మీ/హవర్.

మెర్సెడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి కూపే :
ఇది 900ఎన్ఎమ్ టార్క్, 577 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేయగల 5.5లీ, .బై టర్బో వి8 ఇంజన్‌ను కలిగి ఉంది.

ఇది కేవలం 4.2 సెకండ్లలో 100 కి.మీ/హవర్ వేగాన్ని అందుకోగలదు. ఇందులోని ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇందుకు తోడ్పడుతుంది.


Click it and Unblock the Notifications








