భారత్ కు రానున్న సరికొత్త మెర్సెడెస్-బెంజ్ జి.ఎల్.సి ఎస్.వీ.యూ: ఆవిష్కరణ
మెర్సెడెస్-బెంజ్ చివరికి తన జి.ఎల్.సి ఎస్.వీ.యూ ఫస్ట్ లుక్ ను ప్రపంచానికి ఆవిష్కరించింది. జీ.ఎల్.కే స్థానాన్ని భర్తీ చేసేలా భారత్ లోను, అంతర్జాతీయంగాను ఎంట్రీ ఇవ్వనుంది.
ఏజీ డయ్మాలర్ బోర్డు మరియు మెర్సెడెస్-బెంజ్ పరిశోధనా సంస్థ సభ్యుడు అయిన థామస్ వెబర్ "ఎస్.వీ.యూ సిద్ధాంతాన్ని అమలుచేయడంలో మా కొత్త జి.ఎల్.సి మరో అడుగు ముందుకు వేసింది" అని వెల్లడించారు.
"అద్భుతమైన డ్రైవింగ్ సౌకర్యంతో పాటు రోడ్డు మీద మెరిసేలా స్పోర్టీ టచ్ తో కలగలిసి తయారవడమే కాక కళ్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దబడింది" అని తర్వాత వెల్లడించారు.
క్రింది కథనం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.....

మెర్సెడెస్-బెంజ్ సరికొత్త జి.ఎల్.సి ఎస్.వీ.యూ అంతర్జాతీయ మార్కెట్ లో ఆవిష్కరించబడింది. దీన్ని మొదటి సారి 2016 ఆటో-ఎక్స్ ఫోలో విడుదల చేయనున్నారు.

కొత్త జి.ఎల్.సి ఎస్.వీ.యూ ఆకట్టుకునే ముందు భాగాన్ని కలిగిఉంది. ఇది ఇతర వాహనాల్లా కాకుండా మెర్సెడెస్-బెంజ్ సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది. ఇది రెండు స్లాట్ ల క్రోమ్ గ్రిల్ తో పాటు మధ్యలో మూడు పాయింట్లు ఉన్న పెద్ద స్టార్ లోగోను కలిగి ఉంది.

ఇది మిడ్ రేంజ్ ఎస్.వీ.యూ ఇది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా అందిస్తున్న మోడల్. సైడ్ నుంచి గమనిస్తే...జి.ఎల్.సి ఎస్.వీ.యూ స్టైల్ గా కన్పించడమే కాకుండా ఎక్కువ ఆఫ్ రోడ్ స్టేన్ ను కలిగి ఉంది. స్టైల్ సాధారణంగా రూపొందించబడింది.

వెనుక భాగం నుంచి గమనిస్తే...జి.ఎల్.సి స్మూత్ గా, క్లాస్ గా, ఓ సమయంలో అందరు తయారీదారులు కోరుకునేలా ఎక్కువ స్పోర్టీగా, పదునైన లుక్ తో కన్పిస్తుంది. మెర్సెడెస్-బెంజ్ కళ్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దబడింది. టెయిల్ లైట్స్ స్మూత్ గా మరియు ఓవల్ షేప్ లో డిజైన్ చేయబడ్డాయి.

లోపలి భాగంలో కూడా జి.ఎల్.సి ప్రీమియర్ గాను, లగ్జరియస్ గా ఉంది. చిత్రంలో తెలుపు, నలుపు రంగుల్లో కన్పిస్తున్నప్పటికీ ఇది అనేక రంగుల్లో లభిస్తుంది. డీసెంట్ గా కన్పించడం కోసం బ్లూ కలర్ రౌండ్ ఏసెంట్ ను కలిగి ఉంది. మెర్సెడెస్-బెంజ్ ఎక్కువ స్పోర్టీ ఫీల్ కోసం చదునైన కింది భాగం కలిగిన స్టీరింగ్ వీల్ ను అందిస్తోంది.

అంతర్జాతీయంగా మెర్సెడెస్-బెంజ్ ఒకే డీజల్ ఇంజన్ ను రెండు వేర్వేరు ట్యూన్ లలో అందిస్తోంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పాటు ఫోర్ వీల్ డ్రైవింగ్ ను అందిస్తోంది. హైబ్రిడ్ ప్లగ్ ఇన్ ద్వారా పెట్రోల్ ఇంజన్ ఆఫ్షన్ ను అందిస్తోంది. మెర్సెడెస్-బెంజ్ త్వరలో ఏఎమ్జీ పవర్ కలిగిన పెట్రోల్ ఇంజన్ ను తీసుకురానుంది.

మెర్సెడెస్-బెంజ్ జి.ఎల్.సి ఎస్.వీ.యూ భారత్ లో విడుదల అయితే ఆడీ క్యూ5, బీఎమ్.డబ్ల్యూ ఎక్స్3 ఎస్.వీ.యూ మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది. దీన్ని 2016 ఆటో-ఎక్స్ ఫోలో ప్రదర్శించడంతో పాటు విడుదల చేయనున్నారు.
వీడియో మెర్సెడెస్-బెంజ్ జి.ఎల్.సిని యాక్షన్ ద్వారా వీక్షించండి.


Click it and Unblock the Notifications