సిఈఎస్ 2015లో మెర్సిడెస్ బెంజ్ సెల్ఫ్ డ్రైవింగ్ కాన్సెప్ట్ కారు

By Ravi

భవిష్యత్తులో కారు నడపాలనుకునే వారికి డ్రైవింగ్ తప్పనిసరిగా వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. దాదాపు అన్ని కార్ కంపెనీలు డ్రైవర్ రహిత కార్లను (అటానమస్ కార్) తయారు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాల దిగ్గజం గూగుల్ తమ స్వీయ చాలక (డ్రైవర్ లెస్) ప్రోటోటైప్ కారును ఆవిష్కరించి, అమెరికా రోడ్లపై టెస్టింగ్ కూడా చేస్తున్న సంగతి తెలిసినదే.

తాజాగా.. జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కూడా ఓ డ్రైవర్‌లెస్ కారును అభివృద్ధి చేసింది. ఈ ఏడాది జరగనున్న సిఈఎస్ 2015 షోలో మెర్సిడెస్ బెంజ్ తమ సెల్ఫ్ డ్రైవింగ్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ ఆటోమేటిక్ కారుకు సంబంధించి ఓ టీజర్ ఫొటోను కూడా విడుదల చేసింది.

self driving car concept

ఈ టీజర్ ఫొటోని బట్టి చూస్తుంటే, మెర్సిడెస్ బెంజ్ సెల్ఫ్ డ్రైవింగ్ కాన్సెప్ట్ కారు మంచి ఏరోడైనమిక్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. భవిష్యత్తులో ప్రమాదర రహిత వాహనాలను సృష్టించాలనే లక్ష్యంలో భాగంగా మెర్సిడెస్ బెంజ్ ఈ వాహనాన్ని అభివృద్ధి చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఎస్500 ఇంటెలిజెంట్ డ్రైవ్ సిస్టమ్ ఆధారంగా ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు సమాచారం.

ఈ టెక్నాలజీలో ఓ 360 డిగ్రీ స్టెరోస్కోపిక్ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లలో ఉండే రాడార్లు ఉంటాయి. ఇవి పంపించే డేటా ఆధారంగా కారు తన కదలికలను చేస్తుంది. గడచిన సంవత్సరంలో కూడా మెర్సిడెస్ బెంజ్ ఈ తరహా కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ ట్రక్ 2015 కూడా ఇదే తరహా టెక్నాలజీని ఆధారంగా చేసుకొని, డ్రైవర్ అవసరం లేకుండా జర్మనీలోని ఆటోబన్ హైవేపై పరుగులు తీసింది.

More from DriveSpark

Article Published On: Saturday, January 3, 2015, 11:20 [IST]
English summary
German luxury car manufacturer Mercedes-Benz is always coming with new technology to implement in its vehicles. They are at the front runners when it comes to creature comfort in their vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+