యస్ఎల్‌‌కె కాదు యస్ఎల్‌సి : మెర్సిడెస్ బెంజ్

By Anil

మెర్సిడెస్ బెంజ్ అధికారికంగా తమ భవిష్యత్తు కారు యస్ఎల్‌సి రోడ్‌స్టర్‌ను డెట్రాయిట్‌లో జరిగిన నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షోలో ప్రదర్శించింది. మెర్సిడెస్ బెంజ్ దాదాపుగా ఐదు మోడల్స్‌ను ప్రదర్శించినట్లు తెలిసింది.

మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసిన యస్ఎల్‌సి మోడల్స్‌కు చెందిన పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 కోడ్ పేరు

కోడ్ పేరు

మెర్సిడెస్ బెంజ్ ఈ యస్‌ఎల్‌సి కారును ఇంతకు ముందు యస్‌ఎల్‌కె అనే కోడ్ పేరుతో ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా దీని పేరును మెర్సిడెస్ బెంజ్ యస్‌ఎల్‌సి అని నామకరణం చేశారు.

లభించు వేరియంట్లు

లభించు వేరియంట్లు

మెర్సిడెస్ బెంజ్ వారు ఈ యస్‌ఎల్‌సి కారును ఐదు వేరియంట్లలో విడుదల చేశారు. ఈ ఐదు వేరియంట్లు కూడా యస్‌ఎల్‌సి సిరీస్‌తో ఉంటాయి. అవి,

  1. యస్‌ఎల్‌సి180
  2. యస్ఎల్‌సి200
  3. యస్‌ఎల్‌సి250డి
  4. యస్ఎల్‌సి300 మరియు
  5. యస్ఎల్‌సి43ఎయమ్‍‌జి
యస్ఎల్‌సి180

యస్ఎల్‌సి180

మెర్సిడెస్ బెంజ్ యస్ఎల్‌సి180 మోడల్‌‌లో 1.8-లీటర్, నాలుగు సిలిండర్ల టర్బోఛార్జ్‌‌డ్ ఇంజన్ కలదు ఇది దాదాపుగా 154బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

యస్‌ఎల్‌సి200 మరియు యస్‌ఎల్‌సి300

యస్‌ఎల్‌సి200 మరియు యస్‌ఎల్‌సి300

యస్‌ఎల్‌సి200 మరియు యస్‌ఎల్‌సి300 రెండు వేరియంట్లలో కూడా 1.9-లీటర్ గల నాలుగు సిలిండర్ల టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. 200 లోని ఇంజన్ 181 బిహెచ్‌పి పవర్, 300ఎన్ఎమ్ టార్క్ మరియు 300 లోని ఇంజన్ 241 బిహెచ్‌పి పవర్, 370 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

యస్‌ఎల్‌సి250డి

యస్‌ఎల్‌సి250డి

ఇందులో గల 2.1-లీటర్ టర్బోఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల ఇంజన్ 201 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ ‌విడుదల చేయడానికి సహాయపడుతుంది.

యస్‌ఎల్‌సి43ఎయమ్‌జి

యస్‌ఎల్‌సి43ఎయమ్‌జి

మెర్సిడెస్ బెంజ్ యస్‌ఎల్‌సి వేరియంట్లలో ఎక్కువ రేంజ్ గల కారు యస్‌ఎల్‌సి43ఎయమ్‌జి, ఇందులో 3-లీటర్ కెపాసిటి గల వి6 టర్బోఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 362బిహెచ్‌పి పవర్ మరియు 520 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేస్తుంది.

గేర్ బాక్స్

గేర్ బాక్స్

ఈ యస్ఎల్‌సి సిరీస్‌లో వేరియంట్ల వారిగా గేర్ బాక్స్ వివరాలు

యస్‌ఎల్‌సి250డి, యస్ఎల్‌సి300 మరియు యస్ఎల్‌సి43ఎయమ్‍‌జి వేరియంట్లలో 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలదు మరియు యస్‌ఎల్‍‌‌సి180, యస్‌ఎల్‌సి200 వేరియంట్లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ కలదు. ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను ఆప్షనల్‌గా అందించారు.

అత్యధిక వేగం

అత్యధిక వేగం

మెర్సిడెస్ బెంజ్ యస్ఎల్‍‌సి కార్లు కేవలం 4.7 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు వీటి అత్యధిక వేగం గంటకు 250 కిలో మీటర్లు.

డిజైన్

డిజైన్

మెర్సిడెస్ బెంజ్ వారు ఇందులో ముందు భాగం ఎక్కువగా ఎయిర్ ఇంటేక్ ఉండేట్లు జాగ్రత్త పడ్డారు, ఎక్కువ గాలిని గ్రహించడం వలన ఇంజన్ త్వరగా వేడెక్కదు. ముందు భాగాన ఉన్న కొత్త గ్రిల్ వజ్రాకారంలో కలదు.

ల్యాంప్స్

ల్యాంప్స్

అన్ని యస్ఎల్‌సి వేరియంట్లలో కొత్త హెడ్ లైట్స్, పగటి పూట వెలిగే యల్‌ఇడి ల్యాంప్స్ మరియు యల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి. వెనుక వైపున ఉన్న రెండు పొగ గొట్టాలను కూడా బంపర్ లోకి కలిసిపోయే విధంగా అందంగా డిజైన్ చేశారు.

ఇంటీరియర్

ఇంటీరియర్

ఇందులో ఇంటీరియర్ సాధారణంగా ఉంటుంది. నాలుగు ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ తెర కలదు, ఇక దీని టాప్‌ను ముడిచేసి ఒపెన్ టాప్‌తో దీనిని నడపవచ్చు.

ధర

ధర

దీనిని ధరకు చెందిన వివరాలను మెర్సిడెస్ బెంజ్ ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ యస్‌ఎల్‌సి మోడల్స్‌ను 2016 మార్చికల్లా అందుబాటులోకి తీసుకురానున్నారు.

మెర్సిడెస్ బెంజ్

More from DriveSpark

Article Published On: Thursday, December 17, 2015, 18:49 [IST]
English summary
Mercedes Reveals SLK Replacement - The SLC Class - Photos
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+