స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నారా..? మీ పేరెంట్స్‌కి మెసేజ్ వెళ్తుంది జాగ్రత్త!

By Ravi

కుర్రాళ్లకి కారు చేతికందితే, వారికి వేగానికి బ్రేకులు సైతం పనిచేయవు. స్పీడ్ అంటే మోజుపడే యువత, ఆ స్పీడ్ కారణంగానే ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకుంటున్న రోజులివి. వీరి వేగాన్ని వారించే వారు లేకపోవటం లేదా వేగంగా నడుపుతుండటాన్ని తమ తల్లిదండ్రులు గుర్తించకపోవటమే ఇందుకు ప్రధాణ కారణంగా తెలుస్తోంది.

అందుకే, టీనేజ్ డ్రైవర్ల వేగానికి అడ్డుకట్ట వేసేందుకు ఓ ప్రత్యేక అప్లికేషన్ పుట్టుకొచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా ఈ అప్లికేషన్‌ను రూపొందించింది. ఈ అప్లికేషన్ వాహన వేగాన్ని గుర్తించి, వాహనం నిర్ధిష్ట వేగాన్ని దాటినట్లయితే, నేరుగా వారి తల్లిదండ్రులకు సందేశాన్ని పంపించేందుకు సహకరిస్తుంది.

Parents Can Now Have An Eye On Their Kids Driving Habit

ఓవర్‌స్పీడ్, సిగ్నల్ జంప్ వంటి విషయాలను కూడా ఈ అప్లికేషన్ గుర్తిస్తుంది. ఈ యాప్ ఇటీవలే 12 నెలల ఫీల్డ్ టెస్ట్ ముగించుకుందని, మిన్నెసోటాకి 300 మంది టీనేజర్లు ఈ అప్లికేషన్‌ను ప్రయోగపూర్వకంగా ఉపయోగించారని యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జనెట్ క్రీసర్ తెలిపారు. డ్రైవర్ సేఫ్టీని మెరుగు పరచడంలో ఈ అప్లికేషన్ చక్కగా ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.

అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం, టీనేజర్లలో అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే జరుగుతున్నట్లు తేలింది. అందుకే టీనేజర్ల స్పీడ్ డ్రైవింగ్‌‌కు చెక్ పెట్టేందుకు ఈ యాప్‌ను డిజైన్ చేశారు. మనదేశంలో కూడా ఇలాంటి అప్లికేషన్ అందుబాటులోకి వస్తే ఎంత బాగుంటుందో కదా..!

More from DriveSpark

Article Published On: Wednesday, February 11, 2015, 11:13 [IST]
English summary
The University of Minnesota has given a solution to that by developing a mobile app, that monitors teenagers driving habits in real time and will alert their parents if rules are being broken.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+