డ్రైవర్‌లెస్ కార్లను అభివృద్ధి చేయనున్న నిస్సాన్, నాసా

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మరియు అమెరికాకు చెందిన నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్) భవిష్యత్తు కోసం అధునాతన డ్రైవర్ రహిత కార్లను తయారు చేసేందుకు చేతులు కలిపాయి. ఈ మేరకు నిస్సాన్, నాసాలు సంయుక్తంగా కాలిఫోర్నియాలోని మెఫెట్ ఫీల్డ్ ఉన్న నాసా పరిషోధన కేంద్రంలో ఈ ప్రాజెక్టుపై పనిచేయనున్నాయి.

ఐదేళ్ల కాలం పాటు కుదుర్చుకున్న ఈ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ భాగస్వామ్యంలో భాగంగా రూపుదిద్దుకోబోయే అటానమస్ వాహనాలను (డ్రైవర్ రహిత వాహనాలను) ఇటు కమర్షియల్ పర్పస్ కోసం ఉపయోగించడమే కాకుండా, అటు అంతరిక్షంలో కూడా ఉపయోగించనున్నారు. ఈ జేవీలో భాగంగా, నాసా పరిశోధకులు సిలికాన్ వ్యాలీలోని నిస్సాన్ రీసెర్చ్ యూనిట్‌లో పనిచేయనున్నారు.

NASA And Nissan To Work On Driverless Cars

నిస్సాన్ 2016-20 నాటికి తమ అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీని వినియోగదారులకు పరిచయం చేయాలని భావిస్తోంది. అలాగే, అంగారక (మార్స్) గ్రహంపై సాఫ్ట్‌వేర్ మరియు రోబోట్స్‌తో కంట్రోల్ చేయబడే వాహనాలను కూడా డిజైన్ చేయనుంది. ప్రమాదాలను ముందుగానే గుర్తించి వాటిని నివారించేలా ఆటోమేటిక్ బ్రేకింగ్, సెల్ఫ్ పార్కింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లతో ఈ అటానమస్ కార్లను తయారు చేయనున్నారు.

డ్రైవర్ రహిత కార్లపై ఇప్పటికే టొయోటా, జనరల్ మోటార్స్, ఫోర్డ్, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్ కంపెనీలే కాకుండా గూగుల్ వంటి కంపెనీలు కూడా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసినదే. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ఈ టెక్నాలజీపై పనిచేయనున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, January 12, 2015, 12:34 [IST]
English summary
Japanese automaker Nissan and NASA are teaming up to advance the technology behind cars that drive themselves. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+