క్యూ7 లగ్జరీ కారును మలేషియాలో విడుదల చేసిన ఆడి: త్వరలో భారత్‌కు!

By Anil

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన లగ్జరీ వాహనాల శ్రేణిలో మరొక మోడల్ కారును మలేషియాలో విడుదల చేసింది. ఆడి క్యూ7 పేరుతో విడుదలైన ఈ కారు చూడటానికి బాగానే ఉంది. చూడటానికే కాదండి ధర కూడా బాగానే ఉంది.
Also Read: 6,400 కోట్లు విలువ చేసే 27 ఫ్లోర్ల భవంతి, ఏడు ఫ్లోర్లలో 168 లగ్జరీ కార్లు మరియు మూడు హెలీప్యాడ్లు....ఏవరివీ ఈ ఆస్తులు?

ఇది కొన్ని కొత్త పుంతలు తొక్కి వచ్చిందని మా డ్రైవ్‌‌స్పార్క్ ప్రతినిధులు తెలిపారు. అవేంటో సవివరంగా క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి...

ఇంజన్

ఇంజన్

ఈ ఆడి క్యూ7 కారులో3.0 టి‌‌యఫ్‌యస్ఐ వి6 పెట్రోల్ ఇంజన్ కలదు.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఇందులో 8-స్పీడ్ టిప్‌‌ట్రోనిక్ ట్రాన్స్‌‌మిషన్ కలదు. ఇది మనకు 333బిహెచ్‌‌పి పవర్ మరియు 440ఎన్‌‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుందని తెలిపారు.

ఫ్యూయల్ ఎఫీషియన్సీ

ఫ్యూయల్ ఎఫీషియన్సీ

లగ్జరీ కార్లలో మైలేజ్ గురించి మరిచిపోవాలి కాని ఆడి వారు ఈ క్యూ7 కారులో కంబైన్డ్ డైరక్ట్ మరియు మ్యానిఫోల్డ్ ఇంజెక్ట్ సిస్టమ్ అనే పరికరాన్ని అమర్చారు. అందువలన ఇది కొంచెం మైలైజ్‌ను పెంచి ఉద్గారాలను తగ్గింస్తుందని తెలిపారు.

కొలతలు

కొలతలు

ఆడి సంస్థ విడుదల చేసిన క్యూ7 కారు 5.05మీటర్ల పొడవు, 1.97 మీటర్ల వెడల్పు మరియు 1.74 ఎత్తు వంటి కొలతలను ఇది కలిగి ఉంది.

కొత్త డిజైన్

కొత్త డిజైన్

ఆడి ట్రేడ్ మార్క్‌తో గల కొత్త ఫ్రంట్ గ్రిల్, యల్ఇడి హెడ్‌‌ ల్యాంప్స్‌తో పాటు పగటి పూట వెలిగే లైట్లను ఇందులో కల్పించారు. అయితే ఒత రకంగాన చూస్తే ఇది ఆడి క్యూ మోడల్ డిజైన్‌ను కలిగి ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

బరువు

బరువు

ఆడి కారు కేవలం 325 కిలోలు మాత్రమే మోయగలుతుందని వివరించారు. ఆడి కారును తేలికగా ఉండేవిధంగా రూపొందించడానికి ఇందులోని ఇంటీరియర్ డిజైన్ కోసం తేలికపాటి పదార్థాలను ఉపయోగించినట్లు తెలిసింది. అంతే కాకుండా దీని కోసం అల్యూమినియంను వినియోగించినట్లు తెలిసింది.

అత్యధిక వేగం

అత్యధిక వేగం

ఇందులో అన్ని చక్రాలకు శాశ్వత క్వాట్రో డ్రైవ్ సిస్టమ్‌ని అందించారు. ఇది కేవలం 6.3 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. అయితే ఇందులో గల ఎలక్ట్రానికల్ గవర్నర్ ద్వారా ఇది గంటకువ 250 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది.

మైలేజ్

మైలేజ్

ఆడి క్యూ7 లగ్జరీ కారు 100 కిలోమీటర్లకు గాను 7.9 లీటర్ల డీజల్‌ను తాగేస్తుంది. అంటే లీటర్‌కు 12.65 కిలోమీటర్లు మైలేజ్‌ను ఇస్తుంది.

కార్బన్ డై ఆక్సైడ్ ఉధ్గారాలు

కార్బన్ డై ఆక్సైడ్ ఉధ్గారాలు

ఇది ఏ మాత్రం ఉద్గారాలను విడుదల చేస్తుందో కూడా తెలిపారు. ఈ సరి కొత్త ఆడి క్యూ7 కారు కిలో మీటర్‌కు 183ల గ్రాములు చొప్పున కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తుందట.

లభించు రంగులు

లభించు రంగులు

ఈ ఆడి క్యూ7 కారు మొత్తం పది రంగుల్లో లభించనుంది.

గ్లేసియర్ వైట్, క్యారర్ వైట్, కారట్ బీజి, ఫ్లోరెట్ సిల్వర్, ఇంక్ బ్లూ, గ్రాఫైట్ గ్రే, ఆర్గల్ బ్రౌన్, నైట్ బ్లాక్, ఆర్కా బ్లాక్ మరియు పియర్ల్ ప్రభావం గల ప్రత్యేకమైన డేటన్ గ్రే వంటి విభిన్న రంగుల్లో ఇది లభిస్తుంది.

ధర

ధర

దీనిని మలేషియాలో విడుదల చేశారు కాబట్టి మలేషియాలో దీని ధర 589,900 ఆర్‌‌యమ్ గా ఉంది. మన రుపాయల్లో అయితే 91.06 లక్షలుగా ఉంటుంది. ఇక ఇది మన దేశానికి వచ్చిందంటే ఇంకా ఎక్కువ ధర ఉంటుంది.

భారత్‌లో

భారత్‌లో

భారత్‌‌లో దీనిని వచ్చే నెలలో దీనిని విడుదల చేయనున్నారు.

మరిన్ని విశేషాలకు

Article Published On: Tuesday, November 24, 2015, 19:20 [IST]
English summary
All-New Audi Q7 Launched In Malaysia; India Launch Just Around The Corner
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+