సరికొత్త షెవర్లే బీట్: ధర తక్కువ..! ఫీచర్లు ఎక్కువ...!!
దీపమున్నపుడే ఇళ్లు చక్కబెటుకోవాలి, ఆఫర్లు ఉన్నప్పుడే కారు కొనేయాలనేది పాత కాలం మాట. ఎందుకంటే ఆఫర్లు పండుగల సీజన్‌లోనె కాదు ఎప్పుడూ ఉంటాయని షెవర్లే కార్ల సంస్థ అంటోంది. షెవర్లే తన సరి కొత్త బీట్ కారుతో కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.
కొత్త బీట్ మోడల్ కారు కొత్త ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ మార్పులతో ఆకర్షణీయంగా మన ముందుకు వచ్చింది. ఇందులో క్రోమ్ గ్రిల్, కొత్త హెడ్ ల్యాంప్స్ మరియు ఆబరణాల వంటి డిజైన్‌లో టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇక ఇంటీరియర్‌లో యుయస్‌బి మరియు ఎయుఎక్స్ కనెక్టివిటిని సపోర్ట్ చేయగల ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ కలదు.
ఈ సరి కొత్త షెవర్లే బీట్ కారులో 936సీసీ గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు ఇది దాదాపుగా 56బిహెచ్‌పి పవర్ మరియు 143యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మరియు 1.2-లీటర్, 4-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 77బిహెచ్‌పి మరియు 107యన్‌యమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ రెండు ఇంజన్‌లు లీటర్‌కు25.4 మరియు 18.6 కిలోమీటర్ల మైలేజ్‌ని వరుసగా ఇస్తుంది. ఈ రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చాయి.
ఇక ఈ కొత్త బీట్ అందిస్తున్న ఆఫర్ల గురించి చూద్దామా. దీనిని కొన్న వారికి మొత్తం ఐదు సంవత్సరాల ఉటిత వారంటీని అందిస్తోంది. మరియు మొదటి సంవత్సరం ఉచిత ఇన్సురెన్స్‌ను కూడా కల్పిస్తోంది. ఈ కొత్త షెవర్లే బీట్ కారును రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఉచిక టెస్ట్ డ్రైవ్ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మరెందుకు ఆలస్యం క్రింద గల ఫోటో మీద క్లిక్ చేయండి షెవర్లె అందిస్తున్న ఆఫర్లను పొందండి.


Click it and Unblock the Notifications









