కొత్త కన్వర్టబుల్ మిని కూపర్ కారును ఆవిష్కరించారు.మరి ఇది భారత్‌కు వస్తుందా ?

By Anil

మిని కూపర్ తన మూడవ జనరేషన్ కు చెందిన కన్వర్టబుల్ మోడల్ కారును ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ కారును 2015 లో టోక్యో లో జరిగే మోటార్ షోలో దీనిని సాధారణ ప్రజానీకానికి ప్రదర్శణకు ఉంచనున్నారు.

Also Read: మినీ కూపర్ ఎస్ (పెట్రోల్) విడుదల: ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఎంతో పేరుగాంచిన ఈ మిని కూపర్ మూడవ జనరేషన్ కారు యొక్క మరిన్ని విశేషాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి...

పెట్రోల్ ఇంజన్ :

పెట్రోల్ ఇంజన్ :

ఈ కొత్త మిని కూపర్ కారు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మూడు వేరియంట్లను అందిస్తోంది.

  • 1.2-లీటర్, 3-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 102బిహె‌చ్‌పి పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.
  • 1.5-లీటర్, 3-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 134బిహెచ్‌పి పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.
  • 2.0-లీటర్, 4-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 189బిహెచ్‌పి పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.
  • డీజల్ ఇంజన్ :

    డీజల్ ఇంజన్ :

    కొత్త మిని కూపర్ కారు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో రెండు వేరియంట్లను అందిస్తోంది.

    • 1.5-లీటర్, 3-సిలిండర్లు గల డీజల్ ఇంజన్ 114బిహెచ్‌పి పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.
    • 2.0-లీటర్, 4-సిలిండర్లు గల డీజల్ ఇంజన్ 168బిహెచ్‌పి పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.
    • డ్రైవింగ్ మోడ్స్ :

      డ్రైవింగ్ మోడ్స్ :

      ఈ కొత్త కన్వర్టబుల్ మిని కూపర్ కారు మూడు డ్రైవింగ్ మోడ్‌లలో లభించనుంది. ఉత్తమమైన మైలేజ్ రావడానికి ఇది ఎంతో ఉపయోగడుతుంది.

      స్పోర్ట్ మోడ్:

      స్పోర్ట్ మోడ్ ఎంచుకోవడం వలన కారులోని ఇంజన్, ట్రాన్స్‌మిషన్, స్టీరింగ్ వంటి భాగాలన్ని ఆటోమేటిక్‌గా స్పోర్ట్స్ కారు వలె మారిపోతాయి. అంటే మీరు అచ్చం స్పోర్ట్స్ కారును నడుపుతున్న అనుభూతిని పొందుతారు.

      గ్రీన్ మోడ్ :

      గ్రీన్ మోడ్ :

      మీరు ఎప్పడైతే ఈ కారును ఒక లిమిట్ వేగంతో నడుపుతారో అప్పుడు ఆటోమేటిక్‌గా కారు గ్రీన్ మోడ్‌కు మారిపోతుంది. దీని వలన కారు నిర్ణీత వేగంతో ప్రయాణిస్తూ మరియు ఉత్తమమైన మైలేజ్‌ను ఇస్తుంది.

       మిడ్ మోడ్:

      మిడ్ మోడ్:

      మిడ్ మోడ్ అనగా స్పోర్ట్స్ మోడ్‌లా అతివేగంగా కాకుండా, గ్రీన్ మోడ్‌లా నిర్ణీత వేగంతో కాకుండా, ఈ రెండు మోడ్స్‌కు మధ్య రకంగా ఇది ఉంటుంది.

      భద్రత :

      భద్రత :

      మిని కూపర్ మూడవ జనరేషన్ కారు యొక్క భద్రత ఫీచర్లు.

      హైస్ట్రెంథ్ స్టీల్ ఫ్లాట్‌ఫామ్

      రీయింన్‌ఫోర్స్‌డ్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్

      డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్

      డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్

      ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ కంట్రోల్

      సెన్సార్ల ద్వారా ఆపరేట్ చేయగలిగే వెనుక సీట్లు

      ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్స్ :

      ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్స్ :

      ప్రస్తుతం ఇండియాలో మిని కూపర్ పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో కార్లను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడల్స్

      • మిని కూపర్.
      • మిని కూపర్ యస్.
      • మిని కూపర్ కన్వర్టబుల్ (సెకండ్ జనరేషన్).
      • మిని కంట్రీమ్యాన్.
      • ఇండియాలో :

        ఇండియాలో :

        ఈ మూడవ తరం మిని కూపర్ కన్వర్టబుల్ మోడల్ కారుని అంతర్జాతీయ మార్కెట్లోకి 2016 మార్చి నెలలో ప్రవేశ పెట్టనున్నారు. 2016 డిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శింనకు ఉంచే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు దీనిని 2015 టోక్యో మోటర్ షోలో దీనిని ప్రదర్శనకు ఉంచనున్నారు.

        కొత్త కన్వర్టబుల్ మిని కూపర్ కారును ఆవిష్కరించారు.మరి ఇది భారత్‌కు వస్తుందా ?
        • మిని కూపర్ అన్ని మోడల్స్ యొక్క ధరలు తెలుసుకోండి
        • మిని కూపర్‌లోని మరిన్ని మోడల్స్ : పూర్తి సమాచారం మీ కోసం

More from DriveSpark

Article Published On: Tuesday, October 27, 2015, 11:25 [IST]
English summary
New Mini Cooper Convertible Unveiled. Will This New Mini Come To India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+