కొత్త డస్టర్: 2016 ఢిల్లీ ఆటో ఎక్స్-పోలో ప్రదర్శించనున్న రెనొ

By Anil

రెనొ కు చెందిన సరికొత్త డస్టర్ కాంపాక్ట్ యస్‌యువి 2016 డిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్‌-పోలో ప్రదర్శించనుంది. రెనొ సంస్థకు చెందిన ఇంజనీర్లు ఈ సరి కొత్త డస్టర్‌లో భారీ మార్పులతో డిజైన్ చేశారు. ఎక్కువగా ఇందులో డిజైన్‌కు చెదిన మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఈ ఆధునిక కాలంలో అందరూ కోరుకునేది ఇదే కదా.
Also Read: రెనొ క్విడ్- ది మోస్ట్ వాంటెడ్ కారు: సరి కొత్త రికార్డు

రెనొకు ప్రస్తుతం భారతీయ మార్కెట్లో తనేంటొ నిరూపించుకునే సమయం వచ్చింది. అందుకే కాబోలు ఈ మద్యనే భారతీయ మార్కెట్లోకి ఎంట్రిలెవల్ కారు అయిన క్విడ్ ను ప్రవేశ పెట్టింది. దీనిని విడుదల చేసిన అనతి కాలంలోనే విపరీతమైన ఆదరణ పొందింది. అంతే కాకుండా రెనొ డస్టర్ కూడా మంచి పేరును సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో రెనొ ఇండియా మన దేశ మార్కెట్లోకి ఈ నూతన డస్టర్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంది.

 2016 ఆటో ఎక్స్-పో

2016 ఆటో ఎక్స్-పో

రెనొ ఇండియా తమ నూతన డస్టర్ కాంపాక్ట్ ‌యస్‌యువి ను 2016 ఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్-పోలో ప్రదర్శించనుంది.

డిజైన్

డిజైన్

ఈ సరికొత్త డస్టర్ డిజైన్ ముందున్న డస్టర్ ప్రేరణతో రూపొందించారు. ఇందులో డిజైన్ మార్పులను ఏ ఒక్క భాగానికి మాత్రమే పరిమితం చేయకుండా అన్ని భాగాలను కొంచెం క్రొత్త గా ఉండే విధంగా రూపొందిచారు.

ఇంజన్

ఇంజన్

ఇందులో ఇంతకు ముందున్న డస్టర్ ఇంజన్ లను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో ఈ ఇంజన్‌లు అందుబాటులో ఉన్నాయి.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఈ సరికొత్త రెనొ డస్టర్ లో గల 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆర్-ఎయమ్‌టి గేర్ బాక్స్ ‌తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతం రెనొ డస్టర్‌లో ఆటో మేటెడ్ ట్రాన్స్‌మిషన్ మరియు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ తో అందుబాటులో ఉంది. సాధారణంగా ఈ ఎయమ్‌టి వేరియంట్ డస్టర్ ధర కాస్త తక్కువగా ఉంటుంది.

ఫీచర్లు

ఫీచర్లు

2016లో రానున్న రెనొ డస్టర్ వచ్చే ఫీచర్లు

న్యూ హెడ్ లైట్స్

ఫాగ్ ల్యాంప్స్

న్యూ ఫ్రంట్ గ్రిల్

బంపర్

అల్లాయ్ వీల్స్

టెయిల్ ల్యాంప్స్

విభిన్న రంగుల్లో లభించును.

అంతర్జాతీయ మార్కెట్లో

అంతర్జాతీయ మార్కెట్లో

రెనొ డస్టర్ కొన్ని ఇంటీరియర్ మార్పులతో ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో విడుదల అయ్యింది.

భారతీయ మార్కెట్లోకి

భారతీయ మార్కెట్లోకి

భారతీయ కాంపాక్ట్ యస్‌యువి మార్కెట్లోకి ఈ నూతన డస్టర్ కాంపాక్ట్ యస్‌యువి మార్చి 2016 నాటికి విడుదల కానుంది. అప్పటి నుండే అమ్మకాలను కూడా ప్రారభించనున్నట్లు తెలిపారు.

పోటి

పోటి

భారతీయ మార్కెట్లో గల రెనొ డస్టర్ క్రింది మోడల్లకు గట్టి పోటి ఇవ్వనుంది.

హ్యుందాయ్ క్రెటా, నిస్సాన్ టెర్రానొ మరియు త్వరలో విడుదల కానున్న మారుతి సుజుకి వితారా మోడల్లకు ఇది పోటిగా నిలుస్తుంది.

 రెనొ

More from DriveSpark

Article Published On: Friday, December 4, 2015, 19:06 [IST]
English summary
New Renault Duster To Be Showcased At 2016 Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+