క్రాష్ టెస్టులో టాప్ స్కోర్ దక్కించుకున్న కొత్త స్కొడా ఫ్యాబియా

By Ravi

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా, గ్లోబల్ మార్కెట్ల కోసం తయారు చేసిన సరికొత్త ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్, ఇటీవల నిర్వహించిన యూరో ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) క్రాష్ టెస్టులో ఫుల్ స్కోర్ దక్కించుకొని, సురక్షితమైన చిన్న కారుగా నిలిచింది.

వినూత్నమైన భద్రతా వ్యవస్థలు మరియు సమగ్ర భద్రతా ప్యాకేజీలతో తయారు చేసిన తమ సరికొత్త ఫ్యాబియా ఈ సెగ్మెంట్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని, చిన్న కారు అయినప్పటికీ ఇది యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ దక్కించుకోవటం అనేది తమ కార్ల ధృడత్వాన్ని, భద్రతను మరోసారి స్పష్టం చేస్తుందని స్కొడా బోర్డ్ మెంబర్ డా. ఫ్రాంక్ వెల్ష్ తెలిపారు.

ఈ కొత్త స్కొడా ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్ గడచిన సంవత్సరం నవంబర్ నెలలో కొన్ని యూరోపియన్ మార్కెట్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మోడల్ యూకేలో కూడా లభిస్తుంది. మూడవ తరానికి చెందిన ఈ ఫ్యాబియాను గ్లోబల్ వెర్షన్ ర్యాపిడ్ సెడాన్ ఆధారంగా డిజైన్ చేశారు. డిజైన్, ఈకోఫ్రెండ్లీనెస్, టెక్నాలజీ, సేఫ్టీ, కంఫర్ట్ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కారును డిజైన్ చేశామని ఆయన తెలిపారు.

New Skoda Fabia

యూరోపియన్ వెర్షన్ స్కొడా ఫ్యాబియా కారులో ఉండే సేఫ్టీ ఫీచర్లు:
  • ఫ్రంట్ అసిస్టెంట్ విత్ సిటీ ఎమెర్జెన్సీ బ్రేక్ ఫంక్షన్
  • మల్టీ కొల్లైజన్ బ్రేక్
  • ఆప్షనల్ డ్రైవర్ యాక్టివిటీ అసిస్టెంట్
  • స్పీడ్ లిమిటర్
  • హిల్ హోల్డ్ కంట్రోల్
  • ఎలక్ట్రానిక్ టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్
  • యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)
  • 6 ఎయిర్‌బ్యాగ్స్ (ఫ్రంట్, సైడ్, హెడ్)
  • 5 త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్స్
  • యాక్సిడెంట్‌ను తట్టుకునే ధృడమైన బాడీ

More from DriveSpark

Article Published On: Friday, January 16, 2015, 16:35 [IST]
English summary
The new ŠKODA Fabia is the safest small car according to the latest Euro NCAP crash tests. Back in November 2014, the new ŠKODA model achieved the highest score in its segment, becoming the only one of 14 small cars to get five stars in the Euro NCAP crash tests. The Euro NCAP evaluation is based on the results in the categories of passenger protection for adults and children, pedestrian protection, and supporting safety systems.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+