ఫిబ్రవరి 17న కొత్త తరం స్కొడా సూపర్బ్ విడుదల

By Ravi

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా, ఓ నెక్స్ట్ జనరేషన్ సూపర్బ్ లగ్జరీ సెడాన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ కొత్త 2015 స్కొడా సూపర్బ్‌ను కంపెనీ ఈనెల 17వ తేదీన ఆవిష్కరించనుంది.

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ బి8 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన కొత్త తరం స్కొడా సూపర్బ్ సెడాన్‌ను 2015 జెనీవా మోటార్ షో కంటే ముందుగానే ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఈ మోడల్‌కు సంబంధించి ఓ అఫీషియల్ స్కెచ్‌ను కూడా విడుదలైన సంగతి తెలిసినదే.

Skoda Superb

గ్లోబల్ మార్కెట్లలో స్కొడా సూపర్బ్ కారును ఐదు పెట్రోల్, 3 డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో ఆఫర్ చేయనున్నారు. ఇవి 123 బిహెచ్‌పిల పవర్ నుంచి 276 బిహెచ్‌పిల పవర్ రేంజ్‌లలో లభ్యం కానున్నాయి. గేర్‌బాక్స్ విషయానికి వస్తే.. ప్రస్తుత వెర్షన్‌లో ఉపయోగిస్తున్న డిఎస్‌జి గేర్‌బాక్స్‌లనే కొత్త మోడల్‌లోను ఉపయోగించనున్నట్లు సమాచారం.

కొత్త 2015 స్కొడా సూపర్బ్ కారులో రియర్ ప్యాసింజర్ల కోసం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే కంపాటబిలిటీ, 625 లీటర్ల బూట్ స్పేస్, ఫ్రంట్ డోర్లలో అమర్చబడి ఉండే గొడుగులు, రీస్టయిల్డ్ డ్రో ట్రిమ్మింగ్, లెథర్ సీట్లు, అప్‌డేటెడ్ స్టీరింగ్ వీల్, అప్‌డేటెడ్ సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లు/మార్పులు ఉండనున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 11, 2015, 11:21 [IST]
English summary
Skoda has announced that the all new Skoda Superb will be revealed to the world on the 17th of February. The Skoda Superb is Skoda's flagship model.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+