బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌పై నిస్సాన్ కార్నివాల్ 2015
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ తొలిసారిగా బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ పైకెక్కింది. 'నిస్సాన్ కార్నివాల్ 2015' (Nissan CARnival 2015) పేరిట కంపెనీ గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషల్ సర్క్యూట్‌పై ఓ సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఇప్పటి వరకూ ఆడి, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ వంటి కంపెనీలు మాత్రమే నిర్వహిస్తూ వచ్చిన కస్టమర్ అవేర్‌నెస్ తరహా కార్యక్రమాన్ని నిస్సాన్ కూడా పరిచయం చేసింది. ఈ కార్యక్రమానికి నిస్సాన్ తీసుకువచ్చిన రెండు కార్లు షోలో అందరి మదిని దోచుకున్నాయి.
మరి ఆ వివరాలంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌పై నిస్సాన్ నిర్వహించిన కార్నివాల్ 2015 కోసం కంపెనీ తమ పాట్రాల్, లీఫ్, మైక్రా, సన్నీ, టెర్రానో కార్లను తీసుకువచ్చింది.

ఇందులో మేము ముందుగా డ్రైవ్ చేసిన వాహనం పాట్రాల్ ఎస్‌యూవీ. ఈ ఎస్‌యూవీ టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఇదొక శక్తివంతమైన వి8 ఇంజన్ కలిగిన ఎస్‌యూవీ. త్వరలోనే ఇది భారత్‌లో విడుదల కానుంది.

నిస్సాన్ పాట్రాల్ ఎస్‌యూవీ కేవలం ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉండటం కాకుండా, సెగ్మెంట్లో కెల్లా విలాసవంతమైన ఫీచర్లను కూడా కలిగి ఉంది.

ఇకపోతే నిస్సాన్ కార్నివాల్ 2015లో మేము నడిపిన రెండవ కార్ నిస్సాన్ టెర్రానో. రెనో డస్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇటు అర్బన్ రోడ్లకు, అటు ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌కు అనువుగా డిజైన్ చేశారు.

నిస్సాన్ టెర్రానో ఓ టూ-వీల్ డ్రైవ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. అయినప్పటికీ, ఇది క్లిష్టమైన ఆఫ్-రోడ్ పరిస్థితులను సైతం సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలిగింది. ఇదిగో ఈ ఫొటో చూడండి.. జారిపోయే బురద రోడ్లపై కూడా ఇది మంచి కమాండ్‌ని కలిగి ఉంది.

నిస్సాన్ కార్నివాల్ 2015ను ప్రత్యేకించి కంపెనీ తమ పాట్రాల్ ఎస్‌యూవీ కోసం నిర్వహించినట్లుగా అనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీ శక్తి సామర్థ్యాలను కస్టమర్లకు వివరించేందుకు కంపెనీ ఓ సీరియస్ ఆఫ్-రోడ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసింది.

ఆఫ్-రోడ్ ట్రాక్‌పై ఈ సెక్షన్‌లో నిస్సాన్ పాట్రాల్ యొక్క ప్రతి అంశాన్ని గ్రౌండ్ క్లియరెన్స్, పవర్ మొదలైన వాటిని ప్రదర్శించారు. ఇందులో వదులుగా ఉండే ఇసుక, ఎత్తైన గుట్టలు ఉన్నాయి. కానీ వీటన్నింటినీ నిస్సాన్ పాట్రాల్ చాలా సులువుగా అదిగమించేసింది.

నిస్సాన్ తమ కస్టమర్ల కోసం ఓ డిస్పోజల్ సన్నీ సెడాన్‌ను, స్ప్రే పెయింట్ క్యాన్స్‌ను అందుబాటులో ఉంచింది. ఈ సన్నీ కారుపై ఎవరు అందంగా స్ప్రే పెయింట్ చేస్తే వారికి అవార్డును కూడా కంపెనీ అందజేసింది.

ఈ కార్లతో పాటుగా నిస్సాన్ తమ జీరో ఎమిషన్ వెహికల్ నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారును కూడా ప్రదర్శనకు ఉంచింది. యూరోపియన్ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన ఈ కారు పూర్తిగా విద్యత్తుతోనే నడుస్తుంది.

వాస్తవానికి ఎలక్ట్రికా వాహనాలను నడపటం చాలా మంది బోర్‌గా భావిస్తుంటారు. కానీ, నిస్సాన్ లీఫ్ వాహనాన్ని నడిపిన వారు మాత్రం తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. బుద్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌పై ఇది మంచి పవర్, గ్రిప్‌ను కనబరిచింది.

నిస్సాన్ తమ సన్నీ సెడాన్‌లో కొన్ని ల్యాప్‌లు చుట్టి రావటానికి కస్టమర్లకు అవకాశం కల్పించింది. ఎప్పుడూ సిటీ రోడ్లపై సన్నీ సెడాన్‌ను తిప్పి బోర్ కొట్టిన కస్టమర్లు ఈసారి కొంచెం వెరైటీగా తమ సన్నీని ఈ ట్రాక్‌పై పరుగులు పెట్టించారు.

ఈ కార్లన్నింటితో పాటుగా నిస్సాన్ అందిస్తున్న పాపులర్ స్మాల్ కార్ నిస్సాన్ మైక్రాను కూడా కంపెనీ ఈ ట్రాక్‌పై నడిపే అవకాశాన్ని కల్పించింది. పరిమాణంలో చిన్నదిగా ఉన్నప్పటికీ, ఈ హ్యాచ్‌బ్యాక్ మాత్రం ట్రాక్‌పై ఆగకుండా పరుగులు తీసింది.

నిస్సాన్ నిర్వహించిన కార్నివాల్ 2015కు మంచి స్పందన లభించడంతో, ఈ తరహా కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








