2016 నుండి స్వల్పంగా ధరలు పెంచనున్న నిస్సాన్ మరియు డాట్సన్
నిస్సాన్ ఇండియా మరియు డాట్సన్ వాహన సంస్థలు వారు తమ వాహనాల ధరలను స్వల్పంగా పెంచినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఫోర్ట్‌ఫోలియోలో తాము కొన్ని మోడల్స్ మీద మూడు శాతం వరకు ధరలను పెంచినట్లు తెలిపారు. అకస్మాత్తుగా పెంచిన ఈ కొత్త ధరలు జనవరి 1, 2016 నుండి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
ఇవే కాకుండా దేశీయంగా మరిన్ని వాహన సంస్థలు ఇదే బాట పట్టాయి. ముడి సరుకుల వ్యయాలు పెరగడం, విదేశీయం మారకం విలువ తగ్గిపోవడం వంటి కారణాల వలన కార్ల ధరలను 2016 సంవత్సరం జనవరి నుండి పెంచనున్నట్లు తెలిపారు. మరి నిస్సాన్, డాట్సన్ వారు ఏ మోడల్ మీద ధరలను ఎంత వరకు పెంచారో ఒకసారి గమనిద్దామా? అయితే క్రింది కథనం మీద దృష్టిపెట్టండి.

నిస్సాన్ మైక్రా ఆక్టివ్
ప్రస్తుతం నిస్సాన్ మైక్రా ఆక్టివ్ ధర రూ. 4.47 లక్షలుగా ఉంది. దీని ధర 2016 ప్రారంభంలో 13,430.30 వరకు పెరగనుంది.

నిస్సాన్ మైక్రా
నిస్సాన్ మైక్రా కారు యొక్క ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.33 లక్షలుగా ఉంది. వచ్చే ఏడాదికి 15,980.37 రుపాయలు వరకు పెరగనుంది.

నిస్సాన్ సన్ని
నిస్సామన్ సన్ని కారు యొక్క ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.45 లక్షలుగా ఉంది. అయితే వచ్చే ఏడాదికి దీని ధర మీద దాదాపుగా 22,414.52 వరకు పెరగనుంది.

నిస్సాన్ ఎవాలియా
నిస్సాన్ ఎవాలియా మోడల్ యొక్క ప్రారంభ వేరియంట్ ధర దాదాపుగా రూ. 9.14 లక్షలుగా ఉంది. అయితే దీని మీద దాదాపుగా 27,414.69 వరకు పెంచుతున్నట్లు తెలిపారు.

నిస్సాన్ టెర్రానొ
నిస్సాన్ వారి యస్‌యువి అయిన టెర్రానొ కారు ధర మీద 29,970 రుపాయల వరకు పెంపును ప్రకటించారు. ప్రస్తుతం దీని ధర రూ. 9.99 లక్షలుగా ఉంది.

డాట్సన్ గొ
డాట్సన్ వారు కేవలం రెండు కార్ల మీద పెంపును ప్రకటించారు. డాట్సన్ గొ కారులోని ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.23 లక్షలుగా ఉంది. అయితే 2016 నుండి దీని మీద 9690 రుపాయల వరకు పెంచనున్నట్లు తెలిపారు.

డాట్సన్ గొ ప్లస్
డాట్సన్ గొ ప్లస్ యొక్క ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.79 లక్షలుగా ఉంది. అయితే దీని మీద 11,370 రుపాయల వరకు పెంపు ఉంటుందని తెలిపారు.
(గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి)



Click it and Unblock the Notifications








