మార్చి నాటికి నిసాన్ నుంచి చిన్న కారు?
జపనీస్ కార్ తయారీ సంస్థ నిసాన్ మార్చి నాటికి చిన్న కారును భారత మార్కెట్లో విడుదల చేసే ఆలోచనలో ఉంది. ఇది సాధారణంగా 2017లో విడుదల కావాల్సినది.
నిసాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరున్ మల్హోత్రా మాట్లాడుతూ..." ఈ చిన్న కారు మార్చి నాటికి బయటికి రాబోతోంది " అని తెలిపారు. ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు.
ఈ కారు డాట్సన్ ప్లాట్ ఫాంను ఆధారం చేసుకుని మార్చిలో విడుదలకు వస్తున్న మూడవ కారు.

క్రిందటి ఏడాది నిసాన్ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ను భారత్‌లో విడుదల చేసింది. తిరిగి జనవరిలో డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పీవీని నిసాన్ విడుదల చేసింది.
ప్రస్తుతం నిసాన్ 21 ఔట్‌లెట్లను డాట్సన్‌కు సమర్పించింది. 2016 నాటికి ఔట్‌లెట్లను 60కి పెంచే యోచనలో ఉంది.
ఈ కార్ విషయానికోస్తే దానికి డాట్సన్ రెడీ గో అని పేరు పెట్టనున్నారా?
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్‌స్పార్క్.......


Click it and Unblock the Notifications








