నిస్సాన్ స్వే కాన్సెప్ట్.. బహుశా ఇది నెక్స్ట్ జనరేషన్ మైక్రానా..?

By Ravi

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్ ప్రియులను అలరించేందుకు అందమైన కార్ల పండుగ జెనీవా మోటార్ షో సిద్ధమైంది. మార్చ్ నెల 5 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్న 85వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో అనేక కార్ కంపెనీలు తమ సరికొత్త ఉత్పాదనలు ఆవిష్కరించనున్నాయి. ఇందులో భాగంగానే జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ కూడా ఓ కొత్త కాన్సెప్ట్‌ను ప్రదర్శనకు ఉంచుంది.

ఈ కాన్సెప్ట్ కారుకు 'నిస్సాన్ స్వే' (Nissan Sway) అనే పేరును పెట్టారు. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్ ఫొటోని కూడా విడుదల చేసింది. నిస్సాన్ స్వే కాన్సెప్ట్ పేరుతో వస్తున్న ఈ సరికొత్త కారు ఓ నెక్స్ట్ జనరేషన్ మైక్రా అయి ఉండొచ్చని సమాచారం.

nissan concept car sway

సాధారణంగా కాన్సెప్ట్ మోడల్ డిజైన్‌కి, ప్రొడక్షన్ వెర్షన్ డిజైన్‌కి అనేక వ్యత్యాసాలు ఉంటాయి. నిస్సాన్ స్వే కాన్సెప్ట్ టీజర్ ఫొటోలో చూపించిన డేటైమ్ రన్నింగ్ లైట్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఇవే ఫీచర్స్ ప్రొడక్షన్ వెర్షన్‌లో లభిస్తే నిస్సాన్ స్వే ఇంకా అందంగా కనిపిస్తుంది.

ఈ కాన్సెప్ట్ కారులో నిస్సాన్ సిగ్నేచర్ గ్రిల్ మరింత బోల్డ్‌గా కనిపిస్తుంది. బహుశా ప్రొడక్షన్ వెర్షన్‌లో కూడా ఇదే తరహా గ్రిల్ ఉండే అవకాశం ఉంది. ఇదే కాన్సెప్ట్ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని నెక్స్ట్ జనరేషన్ నిస్సాన్ మైక్రాను తయారు చేసినట్లయితే, అది ప్రస్తుత మైక్రా కన్నా ఎన్నోరెట్లు అందంగా కనిపించనుంది. అయితే, ఇది జరగటానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో నిస్సాన్ విక్రయిస్తున్న మైక్రా కారులో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్‌ను పరిచయం చేసింది. ఇందులో కేవలం కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, నిస్సాన్ తమ మైక్రా అమ్మకాలను పెంచుకోవాలంటే, ప్రస్తుత డిజైన్ ట్రెండ్‌కు అనుగుణంగా ఓ సరికొత్త తర్వాతి తరం మైక్రాను తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Thursday, February 26, 2015, 10:49 [IST]
English summary
The 85th Geneva Motor Show is slated to begin on 5th March to 15th March, 2015. Japanese automobile giant, Nissan will also be present at the motor show. They will be showcasing a new concept car at Geneva, which they have christened as the ‘Sway'.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+