డాట్సన్‌లో చవక మోడల్‌ను ప్రవేశపెట్టనున్న నిస్సాన్!
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ భారత మార్కెట్‌పై భారీ ఆశలు పెట్టుకొని తమ 30 ఏళ్ల పురాతన డాట్సన్ బ్రాండ్‌కు తిరిగి జీవం పోసి దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. డాట్సన్ బ్రాండ్ క్రింద ప్రస్తుతం గో హ్యాచ్‌బ్యాక్, గో ప్లస్ ఎమ్‌పివిలు మాత్రమే లభిస్తున్నాయి.
అయితే, ఈ బ్రాండ్‌కు మరింత ఆదరణ కల్పించేందుకు గాను నిస్సాన్ ఓ చవక డాట్సన్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న గో హ్యాచ్‌బ్యాక్ దిగువన ఈ చిన్న కారును ప్రవేశపెట్టనున్నారు.

వచ్చే ఏడాది నాటికి డాట్సన్ చవక కారు మార్కెట్లోకి రావచ్చని అంచనా. ఈ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ వంటి మోడళ్లకు పోటీగా ఈ డాట్సన్ చవక కారును నిస్సాన్ ప్రవేశపెట్టనుంది.
రెనో-నిస్సాన్ కామన్ ప్లాట్‌ఫామ్‌పై ఈ చవక డాట్సన్ కారును తయారు చేయనున్నారు. డాట్సన్ గతంలో ఆవిష్కరించిన రెడి-గో కాన్సెప్ట్ నుంచి స్ఫూర్తి పొంది ప్రొడక్షన్ వెర్షన్‌ను డెవలప్ చేయనున్నారు.

ఐ2 అనే కోడ్‌నేమ్‌తో ఈ డాట్సన్ కారును భారత్‌లోనే డిజైన్ చేసి, తయారు చేయనున్నారు. ఖర్చును తక్కువగా ఉంచేందుకు ఈ కారులో ఉపయోగించే భాగాలలో అధిక శాతం ఇండియన్ మార్కెట్ నుంచే కొనుగోలు చేయనున్నారు.
ధర, ఫీచర్ల విషయంలో ఇది డాట్సన్ గో కన్నా తక్కువగా ఉంటుందని సమాచారం. అయితే, డాట్సన్ గో ఇప్పటికే సేఫ్టీ పరంగా పలు విమర్శలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో, అంతకన్నా తక్కువ ధరకే రానున్న ఈ చవక డాట్సన్ సేఫ్టీ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి?


Click it and Unblock the Notifications








