ప్యారట్ డ్యాష్‌బోర్డుతో కార్లు మరింత స్మార్ట్‌గా మారుతాయ్!
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ప్యారట్ ఓ సరికొత్త డ్యాష్‌బోర్డ్ యూనిట్‌ని ఆవిష్కరించింది. ఈ డ్యాష్‌బోర్డ్ యూనిట్‌తో మీ కారు ఓ సూపర్ కంప్యూటర్‌గా మారిపోతుంది. ఇదొక డబుల్ డిన్ సిస్టమ్. దీని పేరు ఆర్ఎన్‌బి6. ఇదొక ఆఫ్టర్‌మార్కెట్ డివైజ్.
ప్యారట్ ఆర్ఎన్‌బి6ను ఆండ్రాయిడ్ లేదా యాపిల్ డివైజ్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. అన్ని యాప్స్ కూడా హై డెఫినిషన్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఆర్ఎన్‌బిలో ఓ డ్యాష్ క్యామ్ కూడా ఉంటుంది. ఈ కెమెరాను బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు.
ఈ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఫొటోలు, వీడియోలను హెచ్‌డి స్క్రీన్‌పై చూడొచ్చు. డ్రైవర్‌కు లైన్ అసిస్ట్ చేయటానికి మరియు అతను ఏదైనా వాహనాన్ని సమీపిస్తున్నట్లయితే, అప్రమత్తం చేయటానికి ఈ స్క్రీన్ ఉపయోగపడుతుంది.

ప్యారట్ ఆర్‍ఎన్‌బి6 ఓ సేఫ్టీ డివైజ్‌గానే కాకుండా ఓ మంచి ఆడియో సిస్టమ్ కూడా పనిచేస్తుంది. సాంప్రదాయ కర్ సిస్టమ్‌లో మాదిరిగా ఇందులోని ఆడియో ఎఫ్ఎక్స్ కంట్రోల్స్‌లో ఓ ఈక్వలైజర్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఫేడ్ అండ్ బ్యాలెన్సింగ్ ఆప్షన్స్ ద్వారా ఈ డ్యూయెల్ డిన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ నుంచి వచ్చే ఆడియోని కంట్రోల్ చేయవచ్చు.
కారులోని వ్యక్తి ఇష్టానికి తగినట్లుగా సంగీతాన్ని ట్యూనే చేసుకునేందుకు ఇందులో ఆడియెన్స్ సెలక్టర్ కూడా ఉంటుంది. ఇందులో డ్రైవ్ డయాగ్నస్టిక్స్ మరో ఆసక్తికరమైన ఆప్షన్. డ్రైవర్ కారు నడిపిన తీరును (బ్రేకింగ్, యాక్సిలరేషన్ మొదలైనవి) ఇది తెలియజేస్తుంది. వాహన మైలేజ్, వేగం తదితర అంశాలను కూడా ఇది తెలియజేస్తుంది. కారులో ఏం లోపం ఉందో కూడా ఇది తెలియజేస్తుంది
మొత్తమ్మీద ప్యారట్ ఆర్ఎన్‌బి6తో ఓవరాల్ కార్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ మరింత స్మార్ట్‌గా ఉంటుంది. ఇందుకు సంబంధించిన డెమో వీడియోని మీరు కూడా చూసేయండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/2i2rij290xU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








