హుర్రే.. మరోసారి రూ.2 లకు పైగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
మోటారిస్టులకు తీపి కబురు. భారత మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్రమంగా ఇంధన ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, దేశీయ మార్కెట్లో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తాజాగా మరోసారి తగ్గించాయి.
లీటరు పెట్రోల్‌పై రూ.2.42 తగ్గింపును మరియు లీటరు డీజిల్‌పై రూ.2.25 తగ్గింపును ప్రకటించాయి. గడచిన జనవరి నెలలో కూడా చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌పై రూ.2.42 తగ్గింపును మరియు లీటరు డీజిల్‌పై రూ.2.25 తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసినదే.

గడచిన ఆగస్టు 2014 నెల ఇప్పటి వరకూ పెట్రోల్ ధరను తగ్గించడం వరుసగా ఇది 10వ సారి కాగా, డీజిల్ ధరను తగ్గించడం 6వ సారి. మొత్తంగా గత ఆగస్టు 2014 నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్ ధర లీటరుకు రూ.17.11 తగ్గగా, డీజిల్ ధర రూ.12.96 వరకూ తగ్గింది.
తాజా తగ్గింపు తర్వాత ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.56.49 గాను, డీజిల్ ధర రూ.46.01 గాను ఉంది. తగ్గిన ధరలు మంగళవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. మరి ఆలస్యమెందుకు, వెంటనే వెళ్లి మీ కారును ఫుల్ ట్యాంక్ చేయించుకోండి..!


Click it and Unblock the Notifications








