లీటరుకు రూ.2 లకు పైగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇదివరకటి కథనంలో చెప్పుకున్నట్లుగా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి తగ్గించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఆరేళ్ల కనిష్టానికి తగ్గడంతో లీటరు పెట్రోల్‌పై రూ.2.42 తగ్గింపును మరియు లీటరు డీజిల్‌పై రూ.2.25 తగ్గింపును ప్రకటించారు. తగ్గిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.
వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ముడి చమురు ధరలను పరిగణనలోకి తీసుకుంటే.. లీటరు పెట్రోలుపై రూ.4.42, లీటరు డీజిల్‌పై రూ.4.25 తగ్గాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై మరోసారి లీటరుకు రూ2 చొప్పున ఎక్సైజ్ సంకాన్ని పెంచడం జరిగింది. ఫలితంగా.. వినియోగదారుడికి దక్కాల్సిన పూర్తి ప్రయోజనంలో సగం ప్రయోజనం మాత్రమే దక్కింది.

కాగా.. గడచిన ఆగస్టు 2014 నెల ఇప్పటి వరకూ పెట్రోల్ ధరను తగ్గించడం వరుసగా తొమ్మిదోసారి కాగా, డీజిల్ ధరను తగ్గించడం ఐదవసారి. మొత్తంగా గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్ ధర లీటరుకు రూ.14.69 తగ్గగా, డీజిల్ ధర రూ.10.71 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గత జూన్‌లో 115 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం అది 46 డాలర్లకు పడిపోయింది.
తాజా తగ్గింపు తర్వాత హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 67.02 నుంచి రూ. 64.37కు, డీజిల్ ధర రూ. 55.02 నుంచి రూ. 52.57కు తగ్గింది.


Click it and Unblock the Notifications